News March 20, 2025

తను నిజమైన వర్కింగ్ ఉమెన్: ప్రియాంక చోప్రా

image

ప్రియాంక చోప్రాకు జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని ఇన్‌స్టాలో షేర్ చేశారు. తను వైజాగ్ ఎయిర్ పోర్ట్ వెళ్తున్న సమయంలో రోడ్డుపై తనకెంతో ఇష్టమైన జామ పండ్లు కనిపించాయట వాటి ఖరీదు రూ.150 అయితే ప్రియాంక రూ.200 ఇచ్చి ఉంచుకోమని చెప్పిందట, అప్పుడు పండ్లు అమ్మె మహిళ మిగిలిన డబ్బులకు సరిపడేలా కొన్ని పండ్లు ఇచ్చి వెళ్లిందట. తను నిజమైన వర్కింగ్ ఉమెన్ అని నా మనసు గెలిచిందని ప్రియాంక ఇన్‌స్టాలో షేర్ చేశారు.

Similar News

News November 1, 2025

కరోండా(వాక్కాయ) మొక్క.. పొలానికి రక్షణ కవచం

image

పంటకు రక్షణకు నేడు ఇనుప వైర్ ఫెన్స్, కాంక్రీటు స్తంభాలు వేయడానికి చాలా ఖర్చవుతుంది. అయితే పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తోంది ‘కరోండా’. వీటినే వాక్కాయ మొక్కలు అంటారు. ఇది చిన్న పొద రూపంలో పెరుగుతుంది. దీని కాండం, కొమ్మలు ముళ్లతో నిండి ఉంటాయి. ఎండలు, తక్కువ నీరు, ఎలాంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకొని ఇది పెరుగుతుంది. ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ మొక్క పొలానికి సహజమైన గోడలా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది.

News November 1, 2025

కరోండా జీవకంచెతో అనేక ప్రయోజనాలున్నాయ్

image

కరోండా ముళ్లతో నిండి ఉండటం వల్ల పశువులు, మేకలు, అడవి పందులు, కుందేళ్లు ఈ కంచెను దాటలేవు. ఈ మొక్క వేర్లు మట్టిని బలంగా పట్టుకుంటాయి. ఫలితంగా ఇవి నేల కోతను, మృత్తికా క్రమక్షయాన్ని తగ్గిస్తాయి. పంటకు అవసరమైన తేమను నిల్వ ఉంచుతాయి. ఈ పొదల్లో పక్షులు గూళ్లు కట్టుకొని రకరకాల పురుగులను తిని పంటకు మేలు చేస్తాయి. తేనెటీగలు ఈ పూలపై తిరుగుతాయి. వీటి వల్ల పొలాల్లో పరాగసంపర్కం జరిగి పంట దిగుబడి పెరుగుతుంది.

News November 1, 2025

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.