News March 29, 2024
ఆమె సీఎం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు: కేంద్రమంత్రి

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేస్తున్న ఆయన భార్య సునీత కేజ్రీవాల్పై కేంద్రమంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ‘మేడం సీఎం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో బిహార్ సీఎం లాలూ ప్రసాద్ అరెస్టైనప్పుడు రబ్రీదేవి కూడా ఇలాగే చేశారు’ అని హర్దీప్ సింగ్ పురి ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.
Similar News
News December 2, 2025
హిల్ట్ పాలసీపై BRS పోరు బాట

TG: <<18440700>>హిల్ట్<<>> పాలసీతో ప్రజలకు నష్టం కలుగుతోందని ఆరోపిస్తూ పోరుబాటకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీని కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేశారు. HYD చుట్టుపక్కల పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి రేపు, ఎల్లుండి ఆ ప్రాంతాల్లో ఈ టీమ్స్ పర్యటించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలన్నారు.
News December 2, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు

హైదరాబాద్ <
News December 2, 2025
దిత్వా తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


