News May 25, 2024
బంగ్లా ఎంపీని హనీ ట్రాప్ చేసింది ఈమెనే!

బంగ్లా MP అన్వరుల్ అజీమ్ అనర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయన హత్యలో బంగ్లా మోడల్ శిలాస్తి రెహమాన్ కీలక పాత్ర పోషించారు. MPని అపార్ట్మెంట్కు రప్పించేందుకు హనీ ట్రాప్ చేశారు. ఇంట్లోకి రాగానే గొంతు నులిమి చంపి.. చర్మాన్ని ఒలిచారు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ ముక్కలకు పసుపు పూసి సూట్కేసులో కుక్కి కోల్కతాలోని పలు చెరువుల్లో విసిరేశారు. శిలాస్తిని ఢాకా పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News November 28, 2025
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News November 28, 2025
నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ వర్సిటీలో ఉద్యోగాలు

<
News November 28, 2025
బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి మరో షాక్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. మరో 3 అవినీతి కేసుల్లో ఆమెను దోషిగా తేల్చిన ఢాకా కోర్టు ఏడేళ్ల చొప్పున మొత్తం 21 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. ఒక్కో కేసులో రూ.లక్ష జరిమానా చెల్లించాలని, లేకుంటే మరో 18 నెలలు జైలు శిక్ష పొడిగిస్తామని తీర్పునిచ్చింది. హసీనా కూతురు, కుమారుడిపై నమోదైన కేసుల్లో కోర్టు వారిద్దరికీ 5ఏళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కో లక్ష ఫైన్ కట్టాలని తీర్పునిచ్చింది.


