News March 17, 2024

ఇండస్ట్రీలో నిజమైన గురువు ఈయనే: పూనమ్

image

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ పరోక్షంగా డైరెక్టర్ త్రివిక్రమ్‌పై ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. ‘నేను ఇంతకముందే చెప్పాను. మళ్లీ చెబుతున్నా. సినీ పరిశ్రమలో గురువు అనే పదానికి నిలువెత్తు రూపం గౌరవనీయులు దాసరి నారాయణరావు గారు. ప్రతిభతో ఆయన ఆ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇతరుల స్క్రిప్టులు హైజాక్ చేసినట్లు ఆ పేరును హైజాక్ చేయలేరు’ అని పేర్కొంటూ దాసరితో దిగిన ఫొటోను షేర్ చేశారు.

Similar News

News April 3, 2025

ట్రెండింగ్‌లో ‘వింటేజ్ ఆర్సీబీ’

image

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో ఓడిపోవడంతో ఆర్సీబీపై నెటిజన్లు SM వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. తొలి రెండు మ్యాచుల్లో విజయం గాలివాటమేనని కామెంట్లు చేస్తున్నారు. మూడో మ్యాచులో పరాజయంతో ‘వింటేజ్ ఆర్సీబీ’ తిరిగి వచ్చేసిందని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ ఒక్క పరాజయంతో తమ జట్టును తక్కువగా అంచనా వేయొద్దని, ఈ సారి కప్పు కొడతామని ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News April 3, 2025

వక్ఫ్ బిల్లులోని కీలకాంశాలు..

image

* వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ముస్లింలే ఉంటారు. కనీసం ఇద్దరు మహిళలకు చోటు కల్పించాలి.
* వక్ఫ్ కౌన్సిల్‌, రాష్ట్ర బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతరులను నియమించాలి.
* కొత్త చట్టం అమల్లోకొచ్చిన 6 నెలల్లో ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ డేటా‌బేస్‌లో చేర్చాలి.
* వక్ఫ్ ట్రైబ్యునల్ తీర్పులను 90రోజుల్లో హైకోర్టులో సవాలు చేసుకోవచ్చు.
* ఈ ట్రైబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఉండాలి.

News April 3, 2025

ఆరెంజ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్లు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఉమ్మడి కరీంనగర్, HYD, MBNR, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

error: Content is protected !!