News April 3, 2025
ఇతడి కోసమే ముగ్గురు పిల్లల్ని చంపేసింది!

TG: ప్రియుడి కోసం ముగ్గురు కన్నబిడ్డలను అత్యంత పాశవికంగా <<15966011>>హత్య<<>> చేసిన రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు ప్రియుడు శివను సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈక్రమంలోనే శివ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అతడితో వివాహేతర సంబంధం నడిపిన రజిత పెళ్లి చేసుకోవాలని అడిగింది. అయితే పిల్లలు లేకుంటేనే చేసుకుంటానని అతడు చెప్పడంతో ముగ్గురు పిల్లల్ని అడ్డు తొలగించుకునేందుకు కిరాతకంగా హతమార్చింది.
Similar News
News October 14, 2025
బ్రహ్మపుత్రపై రూ.6.4 లక్షల కోట్లతో ప్రాజెక్ట్

బ్రహ్మపుత్ర నదిపై రూ.6.4 లక్షల కోట్లతో హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2047కల్లా 76 గిగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ కెపాసిటీతో ప్లాంట్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ ప్లాన్లో ఈశాన్య రాష్ట్రాల్లోని 12 సబ్ బేసిన్లలో 208 పెద్ద హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి ద్వారా 64.9GW పొటెన్షియల్ కెపాసిటీ, 11.1GW పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ నుంచి జనరేట్ చేయొచ్చని పేర్కొంది.
News October 14, 2025
విదేశీ విద్యపై విప్లవాత్మక నిర్ణయం

TG: విదేశీ విద్యా పథకంలో BC, SC, ST విద్యార్థుల సంఖ్య రెట్టింపు చేస్తూ CM రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో బీసీ విద్యార్థుల్లో లబ్ధిదారుల సంఖ్య 300కాగా ఇప్పుడు అది 700కు చేరనుంది. BC-C, Eలతో కలుపుకుంటే విద్యార్థుల సంఖ్య 1000కి చేరుతుంది. SC విద్యార్థుల సంఖ్య గతంలో 210 ఉండేది. అది ఇప్పుడు 500కు చేరనుంది. ST స్టూడెంట్స్లో లబ్ధిదారులు 100మంది మాత్రమే ఉండేవారు. వాళ్లిప్పుడు 200కు చేరనున్నారు.
News October 14, 2025
OBC ఆదాయ పరిమితి పెంచమన్న కేంద్రం

OBC రిజర్వేషన్ల కోసం క్రీమీ లేయర్ ఆదాయ పరిమితి పెంచే యోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా నిర్దేశించిన ఆదాయం కంటే ఎక్కువుంటే ప్రభుత్వ విద్య, ఉపాధిలో రిజర్వేషన్లు రావు. ఆఖరిసారి 2017లో రూ.6 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.8 లక్షలకు పెంచింది. ఇప్పటికే 2020, 2023లో పెంపు గడువు ముగిసింది. ఈ లిమిట్ పెంచితే పేద OBC వర్గాలకు రిజర్వేషన్లలో పోటీ కష్టమవుతుందనే కేంద్రం అంగీకరించట్లేదని తెలుస్తోంది.