News July 31, 2024
అందరికీ ధైర్యం చెప్పి ప్రాణాలు కోల్పోయింది!

ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్ <<13723684>>ఘటన<<>>లో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రాణాలతో బయటపడిన రిషబ్ అనే విద్యార్థి ప్రమాద సమయంలోని పరిస్థితిని మీడియాతో పంచుకున్నారు. ‘వరద నీటిలో మునిగి లైబ్రరీలో ఉన్న మేమంతా చనిపోతాం అనుకున్నాం. కానీ తన్య మాత్రం అందరికీ ధైర్యం చెప్పింది. మానవహారంగా ఏర్పడి బయటకెళ్దామని సూచించింది. కానీ, అది కుదరలేదు. చివరికి ఆమె నీటిలో మునిగి చనిపోయింది’ అని తెలిపారు.
Similar News
News March 3, 2026
ఈ ఎర పంటలతో ఈ ప్రధాన పంటల్లో పురుగుల నియంత్రణ

☛ బత్తాయి పంట చుట్టూ టమాటాను సాగు చేసి పండు రసం పీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ☛ పసుపు చుట్టూ ఆముదం పంట నాటి కొమ్మ, కాయ తొలుచు పురుగులను ☛ తీగజాతి కూరగాయల పంటల చుట్టూ మొక్కజొన్నను సాగు చేసి పండు ఈగల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ టమాటా చుట్టూ బంతి/దోసను సాగు చేసి కాయతొలుచు పురుగులు/తెల్లదోమలను.. బంగాళాదుంప పంట చుట్టూ వంకాయ మొక్కలను నాటి అక్షింతల పురుగులను కట్టడి చేయవచ్చు.
News March 3, 2026
ఇవాళ స్టాక్ మార్కెట్లకు సెలవు

హోలీ పండగ నేపథ్యంలో ఈరోజు స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు సెలవు ఉంటుంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (BSE) మళ్లీ రేపు తెరుచుకుంటాయి. దీంతో ఇవాళ ఈక్విటీ, సెక్యూరిటీస్ ట్రేడింగ్ ఉండదు. ఇక MCX మార్కెట్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రా.11.30 వరకు కొనసాగుతుంది. ఇక ఈనెలలో శ్రీరామనవమి (మార్చి 26), మహావీర్ జయంతి (మార్చి 31) రోజుల్లో కూడా మార్కెట్ క్లోజ్ ఉంటుంది.
News March 3, 2026
నేడే చంద్రగ్రహణం.. ఎప్పుడు చూడొచ్చంటే?

ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభం కానుంది. అయితే మన దేశంలో ఈ గ్రహణం చివరి దశలో ఉన్నప్పుడే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలవారు సాయంత్రం 6.20 నుంచి 6.47 వరకు గ్రహణాన్ని చూడొచ్చు. కాగా గ్రహణం సందర్భంగా ఈరోజు ప్రధాన ఆలయాలు అన్ని మూతపడతాయి. ఇక భారత్ సహా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికాలోనూ కనిపిస్తుంది.


