News September 23, 2024
నిద్ర పోయి రూ.9లక్షలు గెలుచుకుంది!

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? బెంగళూరుకు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సాయిశ్వరికి ఇది సాధ్యమైంది. తనకు ఎంతో ఇష్టమైన నిద్రను డబ్బుగా మలిచేందుకు ఆమెకు గొప్ప అవకాశం లభించింది. ఓ పరుపుల కంపెనీ స్లీప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నిర్వహించింది. 12 మందిలో ఒకరిగా ఎంపికైంది. కంపెనీ ఇచ్చిన పరుపుపై 2 నెలల పాటు రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోవడమే టాస్క్. విజయవంతంగా టాస్క్ పూర్తిచేయడంతో ఆమె రూ.9లక్షలు గెలుచుకుంది.
Similar News
News October 23, 2025
ఏపీలో 23 ఉద్యోగాలు

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 23 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. బోధన కేటగిరీలోని 10 విభాగాల్లో, బోధనేతర కేటగిరీలోని 10 విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను త్వరలో https://nsktu.ac.in వెబ్సైట్లో పొందుపరుస్తారు. దరఖాస్తులకు నవంబర్ 30 ఆఖరు తేదీ.
News October 23, 2025
UCO బ్యాంక్లో 532 పోస్టులు

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO) 532 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 -28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.uco.bank.in/
✍️ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 23, 2025
మొక్కజొన్న కంకి త్వరగా ఎండటానికి ఇలా చేస్తున్నారు

మొక్కజొన్న కంకి మొక్కకే ఉండి త్వరగా ఎండిపోవడానికి కొందరు రైతులు వినూత్న విధానం అనుసరిస్తున్నారు. మొక్కకు కంకి ఉండగానే.. ఆ మొక్క కర్రకు ఉన్న ఆకులు అన్నింటిని కత్తిరిస్తున్నారు. ఇలా కత్తిరించిన ఆకులను పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. దీని వల్ల కంకి త్వరగా ఎండిపోవడంతో పాటు నేల కూడా త్వరగా ఆరుతోందని చెబుతున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు మొక్కజొన్న రైతులు ఈ విధానం అనుసరిస్తున్నారు.