News November 4, 2024

‘ఆమె’ కాదు ‘అతను’..? ఖెలీఫ్‌లో XY క్రోమోజోమ్‌లు?

image

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్‌కు XY క్రోమోజోమ్‌లు, అంతర్గత వృషణాలు ఉన్నట్లు ఇటీవ‌ల లీకైన వైద్య నివేదిక ద్వారా తెలుస్తోంది. స‌హ‌జంగా XY క్రోమోజోమ్‌లు పురుషుల్లో ఉంటాయి. ఖెలీఫ్‌ను మ‌హిళ‌ల విభాగంలో అనుమ‌తించ‌డం గ‌తంలో తీవ్ర వివాదం రేపింది. ఖెలీఫ్‌కు ఇచ్చిన స్వ‌ర్ణాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని ICONS కో ఫౌండర్ మార్షీ స్మిత్ డిమాండ్ చేశారు.

Similar News

News November 22, 2025

CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

image

<>CSIR<<>>-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(NML) 67 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పోస్టును బట్టి డిప్లొమా, BSc, MSc, BE, B.Tech, M.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: https://nml.res.in/

News November 22, 2025

ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. టెన్త్ పాసై 18-25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.18,000-రూ.56,900. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 14. హైదరాబాద్ బ్యూరోలో 6, విజయవాడలో 3 ఖాళీలు ఉన్నాయి. అప్లై చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News November 22, 2025

అద్దం పగిలితే అపశకునమా?

image

ఇంట్లో ఉన్న అద్దం పగిలిపోతే దురదృష్టం ఏడేళ్ల పాటు పీడిస్తుందని అంటుంటారు. కానీ ఇదో అపోహ మాత్రమే. పూర్వం అద్దాలు ఖరీదుగా ఉండేవి. కేవలం కొందరే వాటిని కొనుగోలు చేయగలిగేవారు. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలని ఈ టాక్టిక్‌ను ఉపయోగించారు. ఇది ఆర్థిక నష్టాన్ని నివారించడానికి పూర్వీకులు వాడిన సామాజిక నియంత్రణ పద్ధతి మాత్రమే. దురదృష్టానికి, అద్దం పగలడానికి ఎలాంటి సంబంధం లేదని పండితులు చెబుతున్నారు.