News October 21, 2024
భర్త బాగుండాలని పూజ చేసి.. గంటల్లోనే చంపేసింది

భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని ఉపవాసం ఉండి పూజలు చేసిన ఓ మహిళ కొన్ని గంటల్లోనే అతనికి విషమిచ్చి చంపేసింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన UPలోని కౌశాంబి జిల్లాలో జరిగింది. శైలేష్, సవిత భార్యాభర్తలు. ‘కర్వాచౌత్’ పండుగ సందర్భంగా నిన్న ఆమె పూజలు చేసింది. అయితే భర్తకు మరొకరితో అఫైర్ ఉందనే అనుమానంతో గొడవపడింది. ఆ తర్వాత అతను తినే ఆహారంలో విషం కలపడంతో చనిపోయాడు.
Similar News
News November 23, 2025
మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్

తెలంగాణ మంత్రులు, పలు శాఖల అధికారిక వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. SBI ఆధార్ అప్డేట్ పేరుతో ప్రమాదకర APK ఫైల్స్ షేర్ అయ్యాయి. ఆ ఫైల్స్ను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్పటికే ఓపెన్ చేసిన పలువురు జర్నలిస్టులు.. తమ ఫోన్లు హ్యాక్ అయినట్లు ఫిర్యాదులు చేస్తున్నారు.
News November 23, 2025
వరి, పత్తి పంటల్లో బోరాన్ లోపం ఇలా గుర్తించండి

☛ వరి: బోరాన్ లోపం వల్ల వరి లేత ఆకుల చివర్లో తెల్లగా మారి వంకర్లు తిరుగుతాయి. వరి పొట్ట దశ నుంచి ఈత దశలో పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజ గట్టిపడక కుదురులోని అన్ని పిలకలు తాలుగా మారతాయి. ☛ పత్తి: లేత చిగుర్లు చిగురించవు. మొగ్గల పెరుగుదల ఆగిపోయి పక్కల నుంచి మొగ్గలు వస్తాయి. లేత ఆకుల చివర్లు, లేత మొగ్గలు దళసరిగా మారి, కుళ్లుతున్నట్లు కనిపిస్తాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి.
News November 23, 2025
ముత్తుసామి సూపర్ సెంచరీ

రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ప్లేయర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ముత్తుసామి(101*) క్రీజులో పాతుకుపోయి సెంచరీతో అదుర్స్ అనిపించారు. ఇది అతడికి తొలి టెస్ట్ సెంచరీ. మార్కో జాన్సన్(49*) సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. INDకు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఇండియన్ బౌలర్లు విజృంభించి వికెట్లు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం RSA స్కోర్ 418/7గా ఉంది.


