News April 13, 2024
శెభాష్.. ఆటోవాలా
ఆటోల వెనుక సినిమాల పేర్లు, హీరోల ఫొటోలు, లవ్ కొటేషన్లు తరచూ చూస్తుంటాం. అయితే HYDలో ఓ వ్యక్తి తన ఆటో వెనుక ముద్రించిన కొటేషన్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘ఎప్పుడైనా చిన్న పిల్లలు వర్షం ఎక్కడి నుంచి వస్తుందని అడిగితే దేవుడు కురిపిస్తాడని కాకుండా.. మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం పడుతుందని చెప్పండి’ అని రాశారు. దాని పక్కన చిగురిస్తున్న చెట్టు బొమ్మను వేసి ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేశారు.
Similar News
News November 16, 2024
‘ఆరెంజ్’ మూవీ హీరోయిన్ ఎంగేజ్మెంట్
తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు హీరోయిన్ షాజన్ పదమ్సీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన ప్రియుడు, బిజినెస్‌మెన్ ఆశిష్ కనాకియాతో ఆమె వివాహం జరగనుంది. కాగా, కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు ఆగలేకపోతున్నానంటూ కాబేయే భర్తతో ఉన్న ఫొటోలను ఆమె పంచుకున్నారు. రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీతో షాజన్ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మసాలా’ మూవీలోనూ ఆమె నటించారు.
News November 16, 2024
గ్రూప్-3 పరీక్షలు.. అభ్యర్థులకు ALERT
TG: రేపటి నుంచి రెండు రోజుల పాటు <<14624157>>గ్రూప్-3 పరీక్షలు<<>> జరగనున్నాయి. ఎగ్జామ్ రాసే అభ్యర్థులు తమ వెంట తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. డూప్లికేట్ హాల్ టికెట్ జారీ చేయరు. తుది ఎంపిక పూర్తయ్యే వరకు హాల్ టికెట్స్, ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. తప్పుడు గుర్తింపు పత్రాలతో, అభ్యర్థి స్థానంలో ఇతరులు హాజరైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
News November 16, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన జైపాల్ యాదవ్ విచారణ
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయనను విచారించారు. దాదాపు 2 గంటలకు పైగా విచారణ సాగింది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని జైపాల్ తెలిపారు. కాగా ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు.