News August 5, 2024

శెభాష్ తెలంగాణ పోలీస్: NRI హర్షం

image

TG: తెలంగాణ పోలీసుల పనితీరు అద్భుతమని ప్రకాశ్ పొట్లూరి అనే NRI ట్విటర్‌లో కొనియాడారు. ఈ నెల 1న పోచారం ఐటీ కారిడార్ పరిధిలో తనను కొంతమంది అపహరించేందుకు చూశారని ఆయన వెల్లడించారు. వారి నుంచి తప్పించుకుని పోలీసులకు సమాచారమిచ్చానని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించడమే కాక చాలా త్వరగా నిందితుడిని గుర్తించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ ఇలా ఉంటే ప్రజలకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News December 2, 2025

తెలంగాణ న్యూస్ అప్డేట్స్

image

☛ HYD ఓల్డ్ సిటీతో మెట్రో కనెక్టివిటీ కోసం రూ.125 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
☛ మహిళల భద్రత, సామాజిక సాధికారతలో భాగంగా 20 మంది ట్రాన్స్‌జెండర్లను HYD మెట్రో సెక్యూరిటీలో సిబ్బందిగా నియమించినట్లు CMO అధికారి జాకబ్ రోస్ ట్వీట్.
☛ రాష్ట్రంలో 2 నెలల్లో AI యూనివర్సిటీ సేవలు. లీడింగ్ గ్లోబల్ యూనివర్సిటీల సహాకారంతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి.

News December 2, 2025

నితీశ్‌ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు: అశ్విన్

image

రాంచీ వన్డేకు ఆల్‌రౌండర్ నితీశ్‌‌ను సెలెక్ట్ చేయకపోవడంపై మాజీ స్పిన్నర్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హార్దిక్ లేని టైంలో నితీశ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని సెలక్షన్ టీంను ప్రశ్నించారు. జట్టు ఎంపికలో ఏదో తప్పు జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. హార్దిక్ స్థానాన్ని అతడు భర్తీ చేయగలరని, అవకాశాలిస్తే మెరుగవుతారన్నారు. ఇలా జరగలేదంటే జట్టు ఎంపికపై సమీక్షించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

News December 2, 2025

డిసెంబర్ 02: చరిత్రలో ఈ రోజు

image

1912: సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి జననం
1960: నటి సిల్క్ స్మిత జననం
1984: భోపాల్ విషవాయువు దుర్ఘటన సంభవించిన రోజు
1985 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు
1996: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మరణం (ఫొటోలో)
* జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం