News September 11, 2025

గొర్రెల స్కాం.. బాధితులను విచారణకు పిలిచిన ఈడీ

image

TG: గొర్రెల స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. గొర్రెలు కొనకుండానే రూ.కోట్లు కొట్టేశారనే ఆరోపణలపై విచారణ జరుపుతోంది. ఈ నెల 15న విచారణకు రావాలని బాధితులకు నోటీసులు జారీ చేసింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు రూ.2 కోట్లు ఎగవేసి అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులు అరెస్టవ్వగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ OSDపైనా కేసు నమోదైంది.

Similar News

News September 12, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News September 12, 2025

శుభ సమయం (12-09-2025) శుక్రవారం

image

✒ తిథి: బహుళ పంచమి మ.1.45 వరకు
✒ నక్షత్రం: భరణి సా.4.31 వరకు
✒ శుభ సమయములు: లేవు
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00
✒ యమగండం: మ.3.00-సా.4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, మ.12.24-మ.1.12
✒ వర్జ్యం: తె.3.43-ఉ.5.13
✒ అమృత ఘడియలు: మ.12.03-మ.1.32

News September 12, 2025

ఆసియా కప్‌: హాంకాంగ్‌‌పై బంగ్లాదేశ్ విజయం

image

ఆసియా కప్‌లో హాంకాంగ్‌తో మ్యాచులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 143/7 స్కోర్ చేయగా, అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. కెప్టెన్ లిటన్ దాస్ 59, హృదోయ్ 35 రన్స్‌తో రాణించారు. రేపు గ్రూప్-Aలో ఉన్న పాక్, ఒమన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.