News June 3, 2024

మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా షీన్‌బామ్!

image

మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు కానుంది. ఆ దేశ అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికవనున్నారు. రూలింగ్ పార్టీకి చెందిన క్లాడియా షీన్‌బామ్ 60% ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇటు ప్రతిపక్ష అభ్యర్థిగానూ మహిళే బరిలో నిలిచారు. విపక్షానికి చెందిన గాల్వెజ్‌కు 30% ఓట్లు వస్తాయని అంచనా. కాగా ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఒకసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి మరోసారి పోటీ చేయకూడదు.

Similar News

News October 10, 2024

రాష్ట్రంలో 604 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

image

AP: KGBVల్లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీచర్ జాబ్‌లు 507, నాన్-టీచింగ్ ఉద్యోగాలు 97 ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, PG, బీఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణులై, 18-42 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది.
వెబ్‌సైట్: https://apkgbv.apcfss.in/

News October 10, 2024

25 నుంచి మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన

image

AP: మంత్రి నారా లోకేశ్ ఈ నెల 25 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. శాన్​ఫ్రాన్సిస్కోలో జరిగే 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు.

News October 10, 2024

ఎంతమంది ఆప్తులయ్యా నీకు టాటా..!

image

మనం లోకాన్ని వీడిన రోజున ఆర్తిగా కన్నీరు పెట్టే నలుగురు లేనప్పుడు ఎంత ఆస్తి ఉన్నా నిరుపయోగమేనంటారు విజ్ఞులు. ఈ విషయంలో రతన్ టాటా కచ్చితంగా శ్రీమంతుడే. ఆస్తిపరంగానే కాక ఆత్మీయుల విషయంలోనూ కుబేరుడే. ఆయన మరణ వార్త తెలిసినప్పటి నుంచీ సోషల్ మీడియా, వాట్సాప్‌లో అన్నింటా ఆయన ఫొటోలే. అందరూ ఆయన గొప్పదనాన్ని తలచుకుంటున్నవారే. ఏదో తమ కుటుంబీకుడినే కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నవారే.