News September 13, 2024
శేఖర్ కమ్ముల, నాని కాంబోలో సినిమా?

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ జరిగాయని, నాని ఓకే చెప్పినట్లు సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. 2025లో షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చని సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం నాని హిట్-3తో పాటు శ్రీకాంత్ ఓదెలతో ఓ మూవీ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల ‘కుబేర’తో బిజీగా ఉన్నారు.
Similar News
News December 9, 2025
మండలానికొక జన ఔషధి కేంద్రం: సత్యకుమార్

AP: నకిలీ, నిషేధిత మందులు మార్కెట్లోకి రాకుండా నిఘా పెట్టాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. ‘ఇటీవల 158 షాపుల్ని తనిఖీ చేస్తే 148కి సరైన అనుమతులు లేవు. సిబ్బంది అక్రమాలను ఉపేక్షించేది లేదు. అవసరమైన సిబ్బందిని APPSC ద్వారా కాకుండా MSRBతో నియమిస్తాం’ అని పేర్కొన్నారు. మండలానికొక జన ఔషధి కేంద్రం ఏర్పాటు యోచన ఉందన్నారు. 11 డ్రగ్ కంట్రోల్, 2 ల్యాబ్ భవనాల్ని మంత్రి వర్చువల్గా ప్రారంభించారు.
News December 9, 2025
పిల్లల ఎదుట గొడవ పడుతున్నారా?

తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే అది పిల్లల్లో భయం, ఆందోళనకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఇవి వారి మానసిక ఆరోగ్యం, చదువు, నిద్ర, సామాజిక సంబంధాలను దెబ్బతీయవచ్చు. అలాగే పెద్దలను అనుకరించే పిల్లలు అదే ప్రవర్తనను తమ జీవితంలో అలవర్చుకునే ప్రమాదముంది. తల్లిదండ్రులు విభేదాలను శాంతంగా పరిష్కరించుకోవాలి.
News December 9, 2025
ఆయనకు ఎన్నో రూపాలు.. అందుకే పూజించాలి!

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్ర|
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః||
ఈ శ్లోకం పరమాత్మను అనేక రూపాలలో ధ్యానించాలని చెబుతోంది. ఆయనకు అనేక శిరములుంటాయి. సృష్టిలో అన్ని వర్ణాలు తానే. విశ్వం పుట్టుకకు కారణం ఆయనే. నిర్మలమైన వినికిడి కలవాడు. గొప్ప తపస్సు చేసేవాడు. తపస్సే తానైనవాడు. ఇన్ని రూపాలు గల విష్ణును ఇలా ధ్యానిస్తే.. శాశ్వతత్వం, అమృతత్వం లభిస్తాయని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


