News October 1, 2024

జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా

image

జపాన్ కొత్త PMగా రక్షణ శాఖ మాజీ మంత్రి షిగేరు ఇషిబా(67) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశానికి రక్షణను మరింత పటిష్ఠం చేయడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దేశ భద్రత అత్యంత బలహీనంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయంగా శాంతిస్థాపనకు, చైనాను అడ్డుకునేందుకు మిత్రదేశాలతో మైత్రిని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు ప్రకటించారు. 19మంది మంత్రులతో కూడిన ఆయన క్యాబినెట్ ఈరోజు కొలువుదీరింది.

Similar News

News October 2, 2024

కలల్ని రీప్లే చేసే పరికరం.. కనిపెట్టిన పరిశోధకులు

image

ఒక్కోసారి చాలా మంచి కల వస్తుంటుంది. మెలకువ వచ్చేస్తే అయ్యో చక్కటి కల డిస్టర్బ్ అయిందే అంటూ ఫీల్ అవుతుంటాం. ఇకపై అలా ఫీల్ కానక్కర్లేదు. మన మనసులో నడిచే కలను ఒడిసిపట్టి దాన్ని తిరిగి రీప్లే చేసే పరికరాన్ని బ్రెయిన్ ఇమేజింగ్, AI సాంకేతికతల సాయంతో జపాన్‌ పరిశోధకులు రూపొందించారు. పరిశోధనలో పాల్గొన్నవారు చెప్పిన కలలకు, పరికరం గుర్తించిన సమాచారానికి 60శాతం కచ్చితత్వం వచ్చిందని వారు తెలిపారు.

News October 2, 2024

దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్ మోగించిన ఇజ్రాయెల్

image

ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ఆ దేశ మిలిటరీ ప్ర‌క‌టించింది. పౌరులు బాంబు షెల్టర్‌లకు దగ్గరగా ఉండాలని ఆదేశిస్తూ దేశవ్యాప్తంగా వైమానిక దాడి సైరన్‌లు మోగించింది. జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా ఈ సైరన్లు మోగించినట్లు పేర్కొంది. ఫోన్లు, TVల ద్వారా ప్ర‌క‌ట‌నలు జారీ చేసింది.

News October 2, 2024

రైతులకు శుభవార్త

image

తెలంగాణలో పామాయిల్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పామాయిల్ గెలల ధరను రూ.17,043కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో రైతులకు దసరా పండుగ ముందే వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పామాయిల్ రైతులకు అధిక ధరలు అందించి రాష్ట్రంలో సాగు లాభసాటి చేసి, అన్నదాతలను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తుమ్మల వెల్లడించారు.