News June 16, 2024
ఫాదర్స్ డే వేళ శిఖర్ ధవన్ భావోద్వేగం

క్రికెటర్ శిఖర్ ధవన్ తన కుమారుడిని తలచుకొని ఎమోషనల్ అయ్యారు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, కుమారుడితో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘నా కుమారుడు నాతో లేని ఈ ఫాదర్స్ డే భావోద్వేగభరితమైంది. నా కొడుకు నాతో కాంటాక్ట్లో కూడా లేడు. నా జీవితంలో అన్నీ ఇచ్చిన మీకు ధన్యవాదాలు నాన్న’ అని పోస్ట్ చేశారు. ధావన్ నుంచి విడాకులు పొందిన <<13074646>>ఆయేషా<<>> కుమారుడితో విదేశాలకు వెళ్లారు.
Similar News
News November 24, 2025
భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది: ప్రధాని మోదీ

ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నటనతో అనేక పాత్రలకు ఆయన ప్రాణం పోశారని కొనియాడారు. ధర్మేంద్ర కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మృతికి బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, తదితరులు సంతాపం తెలిపారు.
News November 24, 2025
BREAKING: భారత్ ఆలౌట్

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు ఆలౌటైంది. 122కే 7 వికెట్లు కోల్పోయిన దశలో సుందర్, కుల్దీప్ 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్ 58, రాహుల్ 22, సాయి 15, పంత్ 7, జడేజా 6, నితీశ్ రెడ్డి 10, సుందర్ 48, కుల్దీప్ 19, బుమ్రా 5 రన్స్ చేశారు. IND 288 పరుగులు వెనుకబడింది. ఫాలో ఆన్ ఆడాల్సి ఉన్నా RSA బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. జాన్సెన్ 6 వికెట్లతో సత్తా చాటారు.
News November 24, 2025
ఫిలింఫేర్ అవార్డుపై ధర్మేంద్రకు అసంతృప్తి

నటనలో శిక్షణ తీసుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ అయినా ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు లభించలేదనే అసంతృప్తి ఉండేదని పలుమార్లు చెప్పేవారు. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం ఆనందాన్నిచ్చిందని ఉద్వేగభరితంగా చెప్పుకున్నారు. ‘గరమ్ ధరమ్ దాబా’, ‘హీ మ్యాన్’ బ్రాండ్లతో రెస్టారెంట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు.


