News August 24, 2024

శిఖర్ ధవన్ రికార్డులు

image

*అంతర్జాతీయ క్రికెట్లో 10867 రన్స్
*భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసిన 12వ <<13928600>>ప్లేయర్<<>>
*24 సెంచరీలు, 79 50+ స్కోర్స్
*2018 ఆసియా కప్‌లో అత్యధిక రన్స్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
*SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో సెంచరీ చేసిన ఏకైక భారత ఓపెనర్
*ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధిక యావరేజ్

Similar News

News January 15, 2026

సొంతూరు వెళ్లొస్తే మనుషుల్లో విశ్వాసం పెరుగుతుంది: CBN

image

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే సంప్రదాయం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సొంతింటికి వెళ్లొస్తే మనుషుల్లో విశ్వాసం పెరుగుతుందని నారావారిపల్లిలో మీడియాతో చెప్పారు. ఒకరికి సాయం చేయాలన్న ఆలోచన కలుగుతుందని తెలిపారు. సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని, జీవనప్రమాణాలు మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి జరిగినట్లని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు.

News January 15, 2026

విజయ్ దేవరకొండ.. మీసాలు మెలేసి ట్రెడిషనల్ లుక్‌లో..

image

సినీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెలేసిన మీసాలు, కళ్లద్దాలతో ఆయన కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలను విలేజ్‌లో జరుపుకుందామని తన తల్లికి ప్రామిస్ చేశానన్నారు. విజయ్ ప్రస్తుతం <<18643470>>’రౌడీ జనార్ధన’<<>>తో పాటు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు.

News January 15, 2026

BISAG-Nలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

image

భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్‌(BISAG-N)లో 6 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్( కంప్యూటర్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, సివిల్ ఇంజినీరింగ్), ఎంఈ, ఎంటెక్(అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్) అర్హత కలిగిన వారు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bisag-n.gov.in/