News December 4, 2024
డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన శిండే

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు ఏక్నాథ్ శిండే అంగీకరించారు. ఆయన ఇంటికి వెళ్లి సీఎం అభ్యర్థి ఫడణవీస్ చర్చించడంతో బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నారు. రేపు ఆయన ఫడణవీస్తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజిత్ పవార్ కూడా డిప్యూటీగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 31, 2026
తిరుమల లడ్డూ వివాదం.. దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు

AP: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో కొందరు తమ పార్టీ, నాయకులపై దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని DGPకి YCP ఫిర్యాదు చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసింది. CBI సిట్ ఛార్జ్షీట్లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ తమ పార్టీని నిందిస్తున్నారని పేర్కొంది. గుంటూరు, వినుకొండ, పిడుగురాళ్ల, దర్శితో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వివరించింది.
News January 31, 2026
శని త్రయోదశి: పూజా సమయమిదే..

పంచాంగం ప్రకారం.. త్రయోదశి తిథి JAN 30న 11:09 AMకే ప్రారంభమైంది. ఆ తిథి నేడు 8:26 AM వరకు ఉంటుంది. అయితే సూర్యోదయ తిథి ప్రాముఖ్యత దృష్ట్యా శనివారం రోజే ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 8:26 AMకే తిథి ముగుస్తుంది కాబట్టి ఆలోపు అభిషేకాలు, పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చని అంటున్నారు. శివారాధన వంటి పూజా కార్యక్రమాలు మాత్రం ప్రదోష వేళలో కూడా నిర్వహించవచ్చు.
News January 31, 2026
భారత్vsన్యూజిలాండ్.. నేడే ఫైనల్ టీ20

IND, NZ మధ్య ఐదో టీ20 ఇవాళ తిరువనంతపురంలో జరగనుంది. టీమ్ ఇండియా ప్లేయింగ్ 11లో హార్దిక్, హర్షిత్ స్థానాల్లో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ వచ్చే అవకాశముంది. సంజూ శాంసన్ తన హోమ్ గ్రౌండ్లో తొలిసారి IND తరఫున ఆడబోతున్నారు. దీంతో ఈ మ్యాచులో అయినా భారీ స్కోర్ చేస్తారేమో చూడాలి. T20 WCకి ముందు ఆడే చివరి మ్యాచ్ ఇదే కావడంతో గెలుపుతో ముగించాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.
లైవ్: స్టార్స్పోర్ట్స్, హాట్స్టార్


