News November 24, 2024
ఎమ్మెల్యేలతో శిండే అత్యవసర భేటీ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే తన పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముంబైలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలందరూ విధిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. కాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫడణవీస్ ముఖ్యమంత్రి అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శిండే ఈ భేటీ నిర్వహించడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
Similar News
News January 23, 2026
మేడారం జాతరకు కేంద్రం నిధులు విడుదల

TG: మేడారం జాతరకు కేంద్రం రూ.3.70 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి జరగనున్న వేడుకల్లో వసతుల కోసం అధికారులు వీటిని ఖర్చు చేయనున్నారు. కాగా ఇప్పటికే కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘గిరిజన సర్క్యూట్ పేరిట’ రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.
News January 23, 2026
త్వరలో బీజేపీలోకి శశిథరూర్?

కేరళ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో నిర్వహించిన కీలక భేటీకి పార్టీ MP శశిథరూర్ గైర్హాజరయ్యారు. అదే సమయంలో తిరువనంతపురంలో జరిగిన PM మోదీ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే మోదీ పాలనను ప్రశంసించిన థరూర్ను INC దూరం పెట్టినట్లు ప్రచారం ఉంది. ఇటీవల రాహుల్ ఓ ప్రసంగంలో తన పేరును విస్మరించడంతో థరూర్ అసంతృప్తిగానూ ఉన్నారు. ఈ పరిణామాలతో ఆయన త్వరలోనే BJPలో చేరొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.
News January 23, 2026
సింగరేణి టెండర్లపై విచారణ కోరుతూ కిషన్ రెడ్డికి హరీశ్ లేఖ

TG: నైనీ కోల్ స్కామ్పై విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి BRS MLA, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. సింగరేణిలో అన్ని టెండర్లను రద్దు చేయాలని కోరారు. సింగరేణి టెండర్లపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొన్నారు. జడ్జితో కుదరకపోతే సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. CM రేవంత్ సింగరేణిలో మరో <<18937157>>3 స్కామ్లకు<<>> పాల్పడ్డారని హరీశ్ ఆరోపించారు.


