News December 2, 2024

శిండేకు అనారోగ్యం.. ఢిల్లీకి అజిత్ పవార్

image

మ‌హారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా మహాయుతిలో పదవుల పంపకం కొలిక్కిరావడం లేదు. కీలక శాఖల కోసం శివసేన, NCP పట్టుబడుతున్నాయి. శాఖల కేటాయింపు తేలకపోవడంతోనే CM అభ్యర్థి ప్రకటనను బీజేపీ వాయిదా వేస్తోంది. దీనిపై సోమవారం జ‌ర‌గాల్సిన మ‌హాయుతి నేత‌ల స‌మావేశం శిండే అనారోగ్యం వ‌ల్ల వాయిదా ప‌డినట్టు తెలిసింది. మరోవైపు కోరిన శాఖల్ని దక్కించుకొనేందుకు అజిత్ పవార్ మళ్లీ ఢిల్లీకి పయనమయ్యారు.

Similar News

News October 24, 2025

కాసేపట్లో భారీ వర్షం..

image

TG: రాబోయే 2 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురుస్తాయన్నారు.

News October 24, 2025

భారత తొలి మహిళా వార్‌ జర్నలిస్ట్‌ ప్రభాదత్‌

image

అనేక పురుషాధిక్య రంగాల్లో ప్రస్తుతం మహిళలు కూడా సత్తా చాటుతున్నారు. కానీ 1965లో ఒక మహిళ యుద్ధక్షేత్రంలోకి దిగి ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని రిపోర్ట్ చేసిందంటే నమ్మగలరా.. ఆమే భారతదేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్. ఆమె ఏం చేసినా సెన్సేషనే. ఎన్నో స్కాములను ఆమె బయటపెట్టారు. ఎన్నో బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయలేదు. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్‌ అవార్డ్‌ వరించింది.

News October 24, 2025

లిక్కర్ స్కామ్ కేసు.. రిమాండ్ పొడిగింపు

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 7 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టు కాగా ఐదుగురు బెయిల్‌పై విడుదలయ్యారు. ఏడుగురు నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.