News November 23, 2024

కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి శిండే?

image

మ‌హారాష్ట్రలో మ‌హాయుతి భారీ విజ‌యం సాధించ‌డంతో CM పీఠంపై ఉత్కంఠ నెల‌కొంది. కూట‌మిలో అత్య‌ధికంగా 132 సీట్ల‌లో ముందంజ‌లో ఉన్న BJP CM ప‌ద‌విని వ‌దులుకోకపోవచ్చు. దీంతో ఏక్‌నాథ్ శిండే, అజిత్ ప‌రిస్థితి ఏంటనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో శిండేకు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇవ్వాలని BJP యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అజిత్‌ను మాత్రం Dy.CMగా కొన‌సాగించవచ్చని సమాచారం.

Similar News

News December 4, 2025

వనపర్తి: నేడు 39 మంది వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు..!

image

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీల్లోని 806 వార్డులకు నేడు మొత్తం 39 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావి – 7 నామినేషన్లు.
✓ పానగల్ – 7 నామినేషన్లు.
✓ పెబ్బేరు – 4 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్ – 21 నామినేషన్లు దాఖలు కాగా.. వీపనగండ్లలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

పొంగులేటి కొడుకు కంపెనీపై కేసు

image

TG: భూకబ్జా కేసులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. వట్టినాగులపల్లిలో 70 మంది బౌన్సర్లతో వచ్చి ల్యాండ్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేశారని, అడ్డుకున్న తమపై దాడి చేశారంటూ పల్లవి షా అనే మహిళ ఫిర్యాదుతో పోలీసులు FIR ఫైల్ చేశారు. NOV 30న ఘటన జరగగా రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు మరో ఐదుగురిపై తాజాగా కేసు నమోదైంది.