News November 30, 2024
శిండేది జ్వరమా లేక వ్యూహమా..!

మహారాష్ట్ర ఆపద్ధర్మ CM ఏక్‌నాథ్ శిండే సతారా జిల్లాలోని తన సొంతూరుకు వెళ్లడంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మళ్లీ CM అవ్వడం లేదన్న నిరాశతో అక్కడికి వెళ్లారని కొందరు అంటున్నారు. అమిత్ షాతో సమావేశమైనప్పటికే తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, విశ్రాంతి కోసమే వెళ్లారని శివసేన లీడర్ ఉదయ్ సమంత్ చెప్పారు. కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు ఆయన సొంతూరుకు వెళ్లడం మామూలేనని మరో నేత సంజయ్ సిర్సత్ అన్నారు.
Similar News
News April 1, 2026
HYD మహిళలు.. రూ.వేల కోట్లు సేవ్ చేశారు!

అవును.. నగరంలోని మహిళలు దాదాపు రూ.1,587 కోట్లు సేవ్ చేశారు. ఈ మొత్తం డబ్బులన్నీ వారు నెలనెలా తమ బ్యాంకు ఖాతాల్లో ఆదా చేయలేదండీ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఆదా చేశారన్నమాట. నగరవ్యాప్తంగా గతనెల 30 వరకు 74.30 కోట్ల ప్రయాణాలు చేశారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేస్తుండటంతో నగరంలో ఇలా మహిళల డబ్బు ఆదా అవుతోందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ‘మహాలక్ష్మి’పై సంబరాలు చేసుకున్నారు.
News April 1, 2026
అమెజాన్ క్లౌడ్ సెంటర్‌పై ఇరాన్ దాడి

ఇరాన్ అన్నంత పని చేసింది. బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్‌పై క్షిపణులతో దాడి చేసింది. దీంతో సర్వర్లు పనిచేయడం లేదని సమాచారం. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికాకు చెందిన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా 18 టెక్ కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ <<19529158>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ఇవన్నీ తమపై దాడులకు సహకరిస్తున్నాయని టెహ్రాన్ మండిపడుతోంది.
News April 1, 2026
ఢిల్లీ బౌలర్లు భళా.. లక్నో స్కోర్ ఎంతంటే?

IPL: ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో లక్నో బ్యాటర్లు తడబడ్డారు. 18.4 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. మార్ష్ 35, పంత్ 7, మార్క్రమ్ 11, పూరన్ 8, అబ్దుల్ సమద్ 36, ముకుల్ 14, షహబాజ్ అహ్మద్ 15* రన్స్ చేశారు. నటరాజన్, ఎంగిడి చెరో 3 వికెట్లతో లక్నో బ్యాటర్లను బోల్తా కొట్టించారు.


