News November 27, 2024
Dy.CM పదవిని శిండే అంగీకరించరు: శివసేన

మహారాష్ట్ర సీఎం పదవి కాకుండా డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఏక్నాథ్ శిండే అంగీకరించబోరని శివసేన స్పష్టం చేసింది. ‘మహాయుతి కూటమి ఏక్నాథ్ శిండే ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికల బరిలోకి దిగింది. అందుకే కూటమి భారీ విజయాన్ని అందుకుంది. శిండే సీఎం పదవికి మరోసారి అర్హుడు. డిప్యూటీ సీఎం పదవిని ఆయన ఒప్పుకోరు’ అని శివసేన నేత సంజయ్ శిర్సత్ India todayతో చెప్పారు.
Similar News
News December 4, 2025
ఇలా చేస్తే.. హ్యాకర్లకి చిక్కరు!

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హిస్టరీ డిలీట్ చేయడం, ప్రైవేట్ ట్యాబ్ ఉపయోగించడం నిజమైన రక్షణ కాదని నిపుణులు అంటున్నారు. పూర్తిస్థాయి ప్రైవసీ కోసం జీరో-లాగ్ VPN వాడటం వల్ల బ్రౌజ్ చేసేటప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు. బ్రౌజింగ్కి వేర్వేరు డివైజ్‌లు ఉపయోగించడం వల్ల డేటా ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. కుకీలను బ్లాక్ చేయాలి. ప్రతీ దానికి ఒకే మెయిల్ వాడకూడదు. పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి.
News December 4, 2025
160 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<
News December 4, 2025
తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు

‘అఖండ-2’ సినిమా టికెట్ రేట్ల <<18450771>>పెంపునకు<<>> TG ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రా.8 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవనున్నట్లు పేర్కొంది. ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ధారించింది. తర్వాతి 3 రోజులు సింగిల్ స్క్రీన్కు రూ.50, మల్టీప్లెక్స్‌లకు రూ.100 చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది. టికెట్ రేట్ల పెంపుతో వచ్చే రెవెన్యూలో 20% మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఇవ్వాలని GOలో పేర్కొంది.


