News December 3, 2024

బ‌ట్ట‌త‌లోడా అని తిట్ట‌డం లైంగిక వేధింపే: UK కోర్టు

image

త‌ల‌మీద వెంట్రుక‌లు లేని వ్యక్తిని బ‌ట్ట‌త‌లోడా అని తిట్ట‌డం లైంగిక వేధింపుల కిందికి వ‌స్తుంద‌ని UK కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు మ‌హిళ‌ల బ్రెస్ట్ గురించి వ్యాఖ్యానించ‌డంతో స‌మాన‌మ‌ని పేర్కొంది. బ్రిటిష్ బంగ్ అనే సంస్థ‌లో ప‌నిచేస్తున్న టోనీ ఫిన్‌ను సూప‌ర్‌వైజ‌ర్ జేమీ కింగ్ ఓ సందర్భంలో బ‌ట్ట‌త‌లోడా అంటూ బూతులు తిట్టారు. ఫిన్ కోర్టును ఆశ్ర‌యించ‌గా ఈ మేర‌కు తీర్పు వెలువ‌రించింది.

Similar News

News January 27, 2026

ఇండియా-EU ట్రేడ్ డీల్.. ఆటో స్టాక్స్‌లో ఆందోళన!

image

భారత్-EU మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో మంగళవారం ఆటోమొబైల్ షేర్లపై ఇన్వెస్టర్లు ఫోకస్‌ చేయనున్నారు. యూరోపియన్ కార్లపై దిగుమతి సుంకాలను 110% నుంచి 40%కి తగ్గించే అవకాశముందని సమాచారం. అదే జరిగితే భారత ఆటో మార్కెట్‌లో పోటీ పూర్తిగా మారనుంది. దేశీయ కంపెనీలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లో ఆటో షేర్లు ఒడుదొడుకులకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

News January 27, 2026

18 ఏళ్ల చర్చల తర్వాత ఇండియా-EU ట్రేడ్ డీల్ ఖరారు

image

దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ చారిత్రక ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌’ను మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. రాబోయే 6 నెలల్లోపు అధికారిక సంతకాలు పూర్తయ్యి 2027 ప్రారంభం నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది.

News January 27, 2026

నిద్ర నాణ్యత పెంచుకోండిలా!

image

పగలంతా హుషారుగా పనిచేయాలంటే రాత్రి నాణ్యమైన నిద్ర అవసరం. అందుకు రోజూ ఒకే టైమ్‌కు నిద్ర పోవడం, లేవడం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ దీన్ని పాటించాలంటున్నారు. పడుకునే చోట లైట్లు పడకుండా, శబ్దాలు రాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. రాత్రి వేళ లైట్ ఫుడ్ తీసుకోవడంతో పాటు నిద్రకు 30-60ని. ముందు స్క్రీన్ చూడటం ఆపాలని సూచిస్తున్నారు. ఒత్తిడికి గురయ్యే విషయాల గురించి ఆలోచించొద్దంటున్నారు.