News May 2, 2024

అక్కడ శివసేన VS శివసేన

image

ముంబైలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ముంబైలో మొత్తం 6 LS నియోజకవర్గాలుండగా అందులో 3చోట్ల శివసేన పార్టీల మధ్య పోటీ నెలకొంది. దక్షిణ ముంబై, దక్షిణ మధ్య ముంబై, వాయవ్య ముంబైలో ఏక్‌నాథ్ శిండే శివసేన, ఉద్ధవ్ శివసేనకు చెందిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. శివసేనలో కీలక నేతగా ఉన్న ఏక్‌నాథ్ పార్టీని చీల్చి BJPతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో ఉద్ధవ్.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్నారు.

Similar News

News March 19, 2026

అదృష్టంగా మారిన దురదృష్టం.. పదేళ్లుగా ఫ్రీగా గ్యాస్!

image

కేరళం ఆలప్పుళకు చెందిన రెత్నమ్మ 2011లో నీటి కోసం బోరు తవ్వించారు. కానీ నీరు పడలేదు. బోరు పైపును క్లోజ్ చేసే సమయంలో ఓ వ్యక్తి అగ్గిపుల్ల వెలిగించగా పైపు నుంచి మంటలు వచ్చాయి. దీనిని గ్యాస్‌లా వాడుకోవచ్చని రెత్నమ్మ ఆ పైపును కిచెన్‌కు కనెక్ట్ చేసుకున్నారు. పదేళ్లు పైగా దానిని వాడుతూ ఏడాదికి రూ.10వేలు సేవ్ చేస్తున్నారు. బోరు నుంచి వచ్చేది మీథేన్ అని, కానీ అక్కడ భూగర్భ నిల్వలు లేవని అధికారులు తేల్చారు.

News March 19, 2026

కేరళం సీఎం ఆస్తి ₹కోటి!

image

కేరళం సీఎం పినరయి విజయన్ ధర్మదమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశారు. తనకు ₹45లక్షల విలువైన బ్యాంక్ డిపాజిట్లు, కన్నూర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ సహా పలు కంపెనీ షేర్లు ఉన్నాయని అఫిడవిట్‌లో వెల్లడించారు. ఓ రెసిడెన్షియల్ ప్లాట్, వ్యవసాయ భూమి కలిపి ₹56లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అలాగే విజయన్‌పై ఆరు కేసులున్నట్లు అఫిడవిట్ పేర్కొంది. <<-se>>#Elections2026<<>>

News March 19, 2026

రంజాన్ ఎల్లుండే..

image

భారత్‌లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను మార్చి 21న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. ఇవాళ ఆకాశంలో నెలవంక కనిపించలేదని పేర్కొన్నారు. రంజాన్ మాసం రేపటి (మార్చి 20)తో ముగియనుందని చెప్పారు. దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.