News February 26, 2025
వెండితెరపై ‘శివుడు’

టాలీవుడ్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణువు పాత్రలతో పాటు శివుడి పాత్రలోనూ స్టార్ హీరోలు అలరించారు. ఎన్టీఆర్(దక్షయజ్ఞం), కృష్ణంరాజు (శ్రీ వినాయక విజయం), శోభన్ బాబు(పరమానందయ్య శిష్యుల కథ), మెగాస్టార్ చిరంజీవి(శ్రీ మంజునాథ), జగపతిబాబు(పెళ్లైన కొత్తలో-సాంగ్లో) భోళా శంకరుడి పాత్రలో కనిపించారు. వీరిలో ఎవరు శివుడి పాత్రలో మెప్పించారో కామెంట్ చేయండి?
Similar News
News February 26, 2025
విమాన ప్రమాదంలో 46కు చేరిన మరణాలు

సూడాన్లో జరిగిన <<15582145>>విమాన ప్రమాదంలో<<>> మరణాల సంఖ్య పెరిగింది. ఓమ్డర్మన్ నగరంలో జరిగిన ఘటనలో మరణాలు 46కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడినట్లు వెల్లడించారు. పౌర నివాసాలపై విమానం కూలడంతో మిలిటరీ సిబ్బందితో పాటు పౌరులు చనిపోయారని పేర్కొన్నారు. 2023 నుంచి సూడాన్లో ఆర్మీకి ర్యాపిడ్ దళాలకు మధ్య యుద్ధం జరుగుతోంది.
News February 26, 2025
తండ్రి నిర్దోషని నిరూపించేందుకు లాయర్లుగా మారిన పిల్లలు!

తప్పు చేయకపోయినా చాలా మంది జైళ్లలో శిక్ష అనుభవిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు అతని పిల్లలు లాయర్లుగా మారారు. యూపీలోని కాన్పూర్లో జరిగిన ఓ వివాదంలో అనిల్ గౌర్పై తప్పుడు ఆరోపణల కారణంగా అతను 11 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. అతడు నిర్దోషని నిరూపించేందుకు కొడుకు రిషభ్, కూతురు ఉపాసన లా చదివారు. తండ్రి కేసుపై ఇద్దరూ అవిశ్రాంతంగా పనిచేసి విజయం సాధించారు.
News February 26, 2025
రాజౌరీలో ఆర్మీ వెహికల్పై ఉగ్రదాడి

జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో టెర్రరిస్టులు ఆర్మీ వాహనంపై దాడిచేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై ఫైరింగ్ చేశారు. వెంటనే భారత జవాన్లు ప్రతిఘటనకు దిగారు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకొనేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది.