News September 13, 2024

20న శివాజీ రీరిలీజ్

image

డైరెక్టర్ శంకర్-సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ శివాజీ మరోసారి థియేటర్లలో అలరించనుంది. ఈ నెల 20న 4K వెర్షన్‌లో మేకర్స్ రీరిలీజ్ చేయనున్నారు. కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో టికెట్ ధర రూ.99 మాత్రమే ఉంటుందని తెలిపారు. 2007లో విడుదలైన ఈ చిత్రంలో సుమన్, శ్రియా, వివేక్, రఘువరన్ కీలక పాత్రల్లో నటించారు. 2012లో ఈ మూవీని 3D డాల్బీ అట్మాస్‌లో రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 28, 2025

పొక్సో కేసులో వ్యక్తికి మూడేళ్ల జైలు: VZM SP

image

విజయనగరానికి చెందిన వి.రవి (49)పై 2025లో నమోదైన పోక్సో కేసులో 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ తెలిపారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి కోర్టులో ఆధారాలు సమర్పించడంతో శిక్ష పడిందన్నారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసినట్లు స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.

News November 28, 2025

భారీ వర్షసూచన.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

AP: దిత్వా తుఫానుతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, ప్రకాశం, బాపట్ల 20 CMకు పైగా వర్షపాతం నమోదవుతుందన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News November 28, 2025

స్నానం చేయించే మెషీన్.. ధర ఎంతంటే?

image

మనుషులకు స్నానం చేయించే యంత్రం ఇప్పుడు జపాన్‌లో అమ్మకానికి వచ్చింది. వాషింగ్ మెషీన్‌లా కనిపించే ఈ పరికరంలో వ్యక్తి పడుకుని మూత మూసుకుంటే.. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. ఒసాకా ఎక్స్‌పోలో భారీ ఆదరణ పొందిన ఈ ‘హ్యూమన్ వాషింగ్ మెషీన్‌’ను సైన్స్ కంపెనీ తయారు చేసింది. మొదటి మెషీన్‌ను ఒసాకాలోని ఓ హోటల్ కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.3.4 కోట్లు (60M యెన్) ఉంటుందని అక్కడి మీడియా పేర్కొంది.