News March 1, 2025

శివకుమార్ పార్టీని చీలుస్తారు: బీజేపీ నేత

image

కర్ణాటక కాంగ్రెస్‌లో చీలికలు వచ్చేఅవకాశముందని ప్రతిపక్ష బీజేపీ నేత అశోక ఆరోపించారు. ఏక్‌నాథ్ శిందే తరహాలో ఆ పార్టీని ఉపముఖ్యమంత్రి డి.కే శివకుమార్ బీజేపీలో విలీనం చేసే అవకాశముందని తెలిపారు. నవంబర్16న కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు జరగనుందని జోస్యం చెప్పారు. అయితే శివరాత్రి వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు డి.కే శివకుమార్ పాల్గొనటంతో పుకార్లు రేగాయి. ఉప ముఖ్యమంత్రి దీన్ని ఖండించారు.

Similar News

News March 1, 2025

80% పెన్షన్ల పంపిణీ పూర్తి: TDP

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమం మూడు గంటల్లోనే 80 శాతం పూర్తైనట్లు టీడీపీ ట్వీట్ చేసింది. గత నెల వరకు తెల్లవారుజామున 5 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయగా.. ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంపిణీ ప్రారంభ సమయాన్ని ప్రభుత్వం 7 గంటలకు మార్చిన విషయం తెలిసిందే.

News March 1, 2025

4 ఎమ్మెల్సీ స్థానాలు.. కాంగ్రెస్‌లో గట్టి పోటీ

image

TG: తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 4 దక్కే ఛాన్స్ ఉంది. ఇందుకోసం 40 మంది వరకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గా రెడ్డి, మధుయాష్కీ, సామ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, రాములు నాయక్, అంజన్ కుమార్ యాదవ్, సరితా యాదవ్ తదితరులు పోటీలో ఉన్నట్లు సమాచారం. యువ నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది.

News March 1, 2025

మూడు రోజుల్లో రూ.1200 తగ్గిన బంగారం ధర

image

భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే తులం బంగారం ధర రూ.1200 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గడంతో రూ.86,620కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,05,000గా ఉంది.

error: Content is protected !!