News February 26, 2025
శివరాత్రి: ఇవాళ ఇలా చేస్తే..

శివ పదమణి మాల ప్రకారం శ అంటే శివుడు. వ అంటే శక్తి అని అర్థం. శివ అంటే శుభపద్రం, మంగళకరం, శ్రేయస్కరం అనే అర్థాలు ఉన్నాయి. శివరాత్రి వేళ ఎవరైతే లింగాన్ని పూజిస్తారో వారికి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. స్పటిక లేదా వెండి లింగానికి శివనామస్మరణ చేస్తూ పంచామృతాలతో, బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే పాపాలు తొలగి పుణ్యం ప్రాప్తిస్తుంది. శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
Similar News
News January 20, 2026
ఒక్క రోజే రూ.12,000 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి, బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.12,000 పెరిగి రూ.3,30,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.950 ఎగబాకి రూ.1,35,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 20, 2026
3 నెలల ముందుగానే వచ్చేశాయ్!

TG: సాధారణంగా ఏప్రిల్లో మార్కెట్లోకి వచ్చే మామిడిపండ్లు ఈసారి 3 నెలల ముందుగానే వచ్చేశాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ, ఎంజే, గడ్డి అన్నారం తదితర మార్కెట్లలో బంగినపల్లి రకం కేజీ రూ.200 వరకు విక్రయిస్తున్నారు. చప్పగా, పుల్లగా ఉండటంతో మామిడి కొనేందుకు చాలా మంది ఇష్టపడట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. హైబ్రిడ్ సాగు విధానాలు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలతో మామిడి ముందుగానే వస్తోందని పేర్కొన్నారు.
News January 20, 2026
కొనసాగుతున్న టారిఫ్ల ఎఫెక్ట్.. నష్టాల్లో మార్కెట్లు

ట్రంప్ టారిఫ్ల ప్రభావం స్టాక్ మార్కెట్లపై ఇంకా కొనసాగుతోంది. సెన్సెక్స్ 270 పాయింట్లు నష్టపోయి 82,975 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 76 పాయింట్లు కుంగి 25,509 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో SBI, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా, NTPC షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.93 వద్ద ప్రారంభమైంది.


