News February 26, 2025

వైభవంగా శివయ్య బ్రహ్మోత్సవం(PHOTOS)

image

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం జరిపించారు. సాయంత్రం భ్రమరాంబ అమ్మవారితో కలిసి మల్లికార్జున స్వామి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రేపు శివరాత్రి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు.

Similar News

News February 26, 2025

నేనైనా లింగ వివక్షను ఎదుర్కోవాల్సిందే: జ్యోతిక

image

హీరో సూర్య భార్యగా తానూ లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు నటి జ్యోతిక చెప్పారు. ‘సూర్యని పెళ్లి చేసుకున్నందుకు నేను అదృష్టవంతురాలినని ఏదైనా ఇంటర్వ్యూలో చెబితే ప్రజలు అతడు మంచివాడని అంటారు. నన్ను పెళ్లి చేసుకొని సూర్య సంతోషంగా ఉన్నాడని చెప్పినా అతడినే పొగుడుతారు. ఇందులో నేనెక్కడా కనిపించను. ఎందుకంటే సమాజం అలా చిత్రీకరిస్తుంది’ అని తాను నటించిన ‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో తెలిపారు.

News February 26, 2025

మహా శివరాత్రితో మహా కుంభమేళాకు తెర

image

ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక మహాకుంభ మేళా నేటితో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినంతో ఈ మహత్తర కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు 65 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చివరి రోజైన ఇవాళ 2 కోట్ల మంది రానున్నట్లు అంచనా.

News February 26, 2025

బ్రహ్మ, విష్ణువు మధ్య వివాదం.. శివుడు ఏం చేశాడంటే?

image

విష్ణువు, బ్రహ్మ మధ్య ఎవరుగొప్ప అనే వివాదం తలెత్తుతుంది. అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, లింగానికి ఆది, అంతాలను కనిపెట్టిన వారే గొప్పవారని చెబుతాడు. విష్ణువు మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. బ్రహ్మ ఆది తెలుసుకోవాలని చూసి విఫలమవుతాడు. అయితే తాను ఆది కనుగొన్నట్లు మొగలిపువ్వు, గోవుతో శివుడికి అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. అది తెలిసి బ్రహ్మ, మొగలిపువ్వు, గోవును శివుడు శపిస్తాడు.

error: Content is protected !!