News December 29, 2024
సీఎం యోగి నివాసం కింద శివలింగం: అఖిలేశ్
UP CM యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం కింద శివలింగం ఉందని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. తమ వద్ద సమాచారం ఉందని, లింగాన్ని వెలికితీసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంభల్‌లో మెట్ల బావి బయటపడిన అనంతరం ASI తవ్వకాలు చేపట్టడంపై BJPని అఖిలేశ్ తప్పుబట్టారు. ‘వాళ్లు ఇలాగే తవ్వుకుంటూ పోతారు. ఏదో ఒకరోజు సొంత ప్రభుత్వానికే గోతులు తవ్వుకుంటారు’ అని విమర్శించారు.
Similar News
News January 1, 2025
పిఠాపురానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే?
AP: పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరున్నర నెలల్లో తాను ఏం చేశాననే <
News January 1, 2025
31st రోజు ఎంత మద్యం తాగారంటే?
కొత్త ఏడాది వస్తుందన్న ఆనందంలో మందుబాబులు కుమ్మేశారు. TG ఎక్సైజ్ శాఖ చరిత్రలో నిన్న(31st) రికార్డ్ స్థాయిలో రూ.403 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. DEC 28 నుంచి JAN 1 ఉదయం వరకు ఏకంగా రూ.1,800 కోట్ల విలువైన లిక్కర్ తాగారని ఎక్సైజ్ శాఖ తెలిపింది. గతంతో పోలిస్తే ఈ గణాంకాలు భారీగా పెరిగినట్లు పేర్కొంది. ఇక ఇవాళ కూడా సెలవు కావడంతో రాత్రి వరకు మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
News January 1, 2025
ఫార్ములా ఈ-రేసు కేసు: రేపటి నుంచి ఈడీ విచారణ
TG: ఫార్ములా ఈ-రేసు కేసు విచారణను ఈడీ వేగవంతం చేసింది. రేపటి నుంచి నిందితులను విచారించనుంది. HMDA మాజీ చీఫ్ BLN రెడ్డి రేపు ఈడీ ముందుకు రానున్నారు. ఎల్లుండి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను, ఈనెల 7న కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. వీరు పెమా చట్టాన్ని ఉల్లంఘించి HMDA నిధులను విదేశీ కంపెనీకి బదిలీ చేశారని ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం.