News June 7, 2024
శివరాజ్ సింగ్కు BJP అధ్యక్ష బాధ్యతలు?
మధ్యప్రదేశ్ మాజీ CM శివరాజ్ సింగ్ చౌహాన్కు BJP జాతీయ అధ్యక్ష బాధ్యతలు దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ జేపీ నడ్డా నుంచి ఆయన పగ్గాలు అందుకోనున్నారట. ఇప్పటికే ఆయనకు ఢిల్లీ కార్యాలయం నుంచి పిలుపు కూడా వచ్చిందట. ఆయన ఆరుసార్లు ఎంపీగా, 16ఏళ్లు సీఎంగా పని చేశారు. ఇటీవల MP అసెంబ్లీ ఎన్నికల్లో BJP గెలిచినా ఆయనకు CM పదవి ఇవ్వకపోవడంతో నిరాశకు గురైన చౌహాన్ వర్గం తాజా వార్తతో ఖుషీ అవుతోంది.
Similar News
News January 11, 2025
నేటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
AP: మకర సంక్రమణ పుణ్యకాలం సందర్భంగా శ్రీశైలంలో నేటి నుంచి ఈ నెల 17 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఉ.8.45గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి స్వామి, అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా నేటి నుంచి 17 వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీ హోమం, స్వామిఅమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవలు నిలిపివేశారు.
News January 11, 2025
ఆమెపై పరువునష్టం దావా: గరికపాటి టీమ్
ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారం చేసిన మహిళను చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమైనట్లు ఆయన టీమ్ తెలిపింది. సరస్వతుల కామేశ్వరిపై పరువు నష్టం దావా వేయడంతో పాటు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు SMలో ప్రకటించింది. అలాగే దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లకూ లీగల్ నోటీసులు పంపించినట్లు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంది. అభిమానులు ఈ విషయంలో ఇకపై ఆందోళన చెందరాదని గరికపాటి టీం పేర్కొంది.
News January 11, 2025
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ నిధులు పూర్తిస్థాయిలో చెల్లించేవరకు సేవలు అందించబోమని ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి. 2 రోజుల క్రితం ప్రభుత్వం రూ.120 కోట్ల బకాయిలు రిలీజ్ చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని అంతా భావించారు. కానీ అన్ని బిల్లులను క్లియర్ చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి.