News June 4, 2024
1.50 లక్షల ఓట్ల మెజార్టీలో శివరాజ్ సింగ్

ఎంపీగా పోటీ చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విదిశాలో తన సమీప ప్రత్యర్థి ప్రతాప్ భాను శర్మ(కాంగ్రెస్)పై ఆయన 1,50,870 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే శివరాజ్‌కు కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.
Similar News
News December 14, 2025
యూదులే లక్ష్యంగా టెర్రర్ దాడి?

ఆస్ట్రేలియా బీచ్‌లో <<18561798>>కాల్పులు<<>> యూదులే లక్ష్యంగా జరిపినట్లుగా తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి 8 రోజులపాటు యూదులు ‘చనుకా(హనుక్కా)’ పండుగ జరుపుకుంటారు. రాత్రి పూట కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇందుకోసం సిడ్నీలోని బాండీ బీచ్‌కు చేరుకున్న 2 వేల మందిపై ఇద్దరు గన్మెన్లు ఫైరింగ్ జరిపారు. ఇది యూదులపై ఉగ్రవాదులు జరిపిన నీచమైన దాడి అని ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ మండిపడ్డారు.
News December 14, 2025
సర్పంచ్ ఎన్నికలు.. ఒక్క ఓటు తేడాతో విజయం

TG: వికారాబాద్ జిల్లా మర్పల్లి మం. రాంపూర్‌లో కాంగ్రెస్ బలపరిచిన గొల్ల రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ సర్పంచ్‌గా చంద్రశేఖర్ 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సూర్యాపేట (D) కోదాడ మం. కూచిపూడి తండాలో కాంగ్రెస్ మద్దతుదారు హాజీనాయక్, NZB (D) మోపాల్ మం. కులస్పూర్ తండాలో కాంగ్రెస్ బలపరిచిన లలితా భాయి 5 ఓట్ల తేడాతో గెలిచారు.
News December 14, 2025
కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.


