News June 4, 2024

8 లక్షల ఓట్ల మెజారిటీతో శివరాజ్ సింగ్ గెలుపు

image

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, విదిశ BJP అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ 8 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాలో AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అల్లుడు, INC అభ్యర్థి రాధాకృష్ణ 27,205 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శివమొగ్గలో యడియూరప్ప తనయుడు, BJP అభ్యర్థి బీవై రాఘవేంద్ర, హవేరి నుంచి బసవరాజు బొమ్మై గెలుపొందారు. అటు బిహార్‌లో మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ లక్షకుపైగా ఓట్ల తేడాతో గెలిచారు.

Similar News

News December 16, 2025

రూ.1,000 కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తారుగా.. న్యాయమూర్తి ఆశ్చర్యం

image

TG: ఏళ్ల తరబడి కరెంట్ బిల్లు చెల్లించట్లేదంటూ TGSPDCL గీతం యూనివర్సిటీకి ఇటీవల నోటీసులు ఇచ్చింది. దీనిపై ఆ వర్సిటీ హైకోర్టుకు వెళ్లింది. 2008 నుంచి రూ.118 కోట్ల బిల్లులు కట్టకపోవడంతో జస్టిస్ నగేశ్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సామాన్యులు రూ.1,000 కట్టకపోతే అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ కట్‌ చేస్తున్నారని, గీతం వర్సిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని ప్రశ్నించారు. విద్యుత్ శాఖ SE హాజరుకావాలని ఆదేశించారు.

News December 16, 2025

SRHకు లివింగ్‌స్టోన్.. భారీ రేటు

image

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ₹2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిని ₹13 కోట్లకు దక్కించుకుంది. రచిన్ రవీంద్రను ₹2 కోట్లకు, ఆకాశ్ దీప్‌ను ₹కోటికి KKR కొనుగోలు చేసింది. రాహుల్ చాహర్‌ను ₹5.2 కోట్లకు, మ్యాట్ హెన్రీని ₹2 కోట్లకు, సర్ఫరాజ్ ఖాన్‌ను ₹75 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. జోష్ ఇంగ్లిస్‌ను ₹8.6 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.

News December 16, 2025

ఆపరేషన్ సిందూర్‌ ఫస్ట్‌డేనే భారత్ ఓడింది: మహారాష్ట్ర Ex-CM

image

‘ఆపరేషన్ సిందూర్’లో మొదటిరోజే భారత్ ఓడిందని MH Ex-CM, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అంగీకరించినా లేకున్నా భారత ఎయిర్ క్రాఫ్ట్‌లు మొదటిరోజు దాడి చేయలేదన్నారు. ‘గ్వాలియర్, బఠిండా, సిర్సా నుంచి ఎగిరే ఎయిర్‌క్రాఫ్ట్‌లను పాక్ కూల్చేసే ప్రమాదం ఉండడంతో దాడి చేయలేదు. భవిష్యత్తులోనూ వైమానిక, క్షిపణి యుద్ధాలే జరుగుతాయి. 12 లక్షల మంది సైనికులు అవసరమా?’ అని ప్రశ్నించారు.