News October 22, 2024
IAS లోతేటి శివశంకర్కు సుప్రీంకోర్టులో షాక్

AP: ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. క్యాడర్ విభజనలో తనకు అన్యాయం జరిగిందని డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను ఆయన సవాల్ చేశారు. తనను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్రం ఇచ్చిన జీవోను నిలిపివేయాలని SCలో పిటిషన్ వేశారు. క్యాట్, హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని ఆ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
Similar News
News January 29, 2026
ఆటను ఆస్వాదించలేకపోయా.. రిటైర్మెంట్పై యువరాజ్ సింగ్

తన రిటైర్మెంట్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆటను ఆస్వాదించలేకపోయా. మద్దతు, గౌరవం లభించలేదని భావించా. అలాంటప్పుడు ఎందుకు ఆడాలి, ఇంకా ఏం నిరూపించుకోవాలని అనిపించింది. మానసికంగా, శారీరకంగా ఇంతకుమించి చేయలేననే భావన ఏర్పడింది. ఇది చాలా బాధించింది. అందుకే రిటైరయ్యా’ అని సానియా మీర్జాతో ఇంటర్వ్యూలో అన్నారు. 2019లో అంతర్జాతీయ క్రికెట్కు యువీ వీడ్కోలు పలికారు.
News January 29, 2026
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News January 29, 2026
మరణించిన వ్యక్తి కలలో వచ్చారా?

మరణించిన వ్యక్తులు కలలో కనిపించడం అశుభం కాదు. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఇది మనసులోని బలమైన జ్ఞాపకాలకు, వారిపై ఉన్న ప్రేమకు ప్రతిబింబం. మృతులు కలలో కనిపించడం అంటే మీ జీవితంలో ఓ దశ ముగిసి, కొత్త మార్పులు మొదలవుతున్నాయని అర్థం. కొన్నిసార్లు వారు మనల్ని మార్గదర్శనం చేయడానికి కూడా రావచ్చు. మనసులో ఒత్తిడి, అసంపూర్తి కోరికల వల్ల కూడా ఇలాంటి కలలు వస్తాయి. ఆందోళన చెందక, మానసిక సంకేతంగా చూడటం మంచిది.


