News March 5, 2025
SHOCK: ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన 100 కంపెనీలు

అమెరికాను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు ట్రంప్ టారిఫ్స్ వల్ల ప్రొడక్షన్‌పై దెబ్బపడేలా ఉంది. మరోవైపు కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చిలో తీసివేతలు ఉంటాయని 100కు పైగా సంస్థలు ఉద్యోగులకు WARN నోటీసులు ఇచ్చాయి. ఒక్కో కంపెనీ 50 నుంచి 500 మందికి పైగా తీసేస్తాయని సమాచారం. టెక్ ఇండస్ట్రీలోనే కోత ఎక్కువగా ఉండనుంది. దీంతో ఆందోళన నెలకొంది.
Similar News
News March 30, 2026
సల్మాన్- వంశీ పైడిపల్లి సినిమా.. ఏప్రిల్ నుంచి షూటింగ్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న సినిమా కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడిస్తూ సల్మాన్, వంశీ ఉన్న ఫొటోను మేకర్స్ షేర్ చేశారు. SVC బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా సల్మాన్ సరసన నటి నయనతార కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఈ కాంబో ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
News March 30, 2026
జనగణన.. సహజీవన జంటలకు కుటుంబ హోదా

దేశంలో ఎల్లుండి నుంచి కేంద్రం జనగణన చేపట్టనుంది. సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. చాలాకాలంగా కలిసి ఉంటున్న వారిని మ్యారీడ్ కపుల్‌గా గుర్తిస్తామని పేర్కొంది. అందుకు ఎటువంటి ఆధారాలు అవసరం లేదని, కాకపోతే ఆ జంట అనుమతి తప్పనిసరని వెల్లడించింది. గతంలో పెళ్లికాని జంటలు తమను తాము వివాహితులుగా నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 33 ప్రశ్నలతో జనగణన సాగనుంది.
News March 30, 2026
ఏప్రిల్ 4వ వారంలో టెన్త్ ఫలితాలు

AP: టెన్త్ పరీక్ష ఫలితాలు APR 4వ వారంలో విడుదల చేసేందుకు SSC బోర్డు చర్యలు చేపట్టింది. APR2తో పరీక్షలు ముగుస్తాయి. జవాబు పత్రాల మూల్యాంకనం 6-15 తేదీ వరకు జరుగుతుంది. అనంతరం OMR స్కానింగ్ ఉంటుంది. ఆన్సర్ షీట్లలో తేడాలుంటే వెరిఫికేషన్‌కు జిల్లాలను సంప్రదించడం, వాల్యుయేషన్ పత్రాల ర్యాండమ్ చెకప్ అనంతరం కంప్యూటరీకరణ చేస్తుంది. ఇవి పూర్తయ్యాక 30లోపు రిజల్ట్స్ ప్రకటిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.


