News March 26, 2025
SHOCK: మరికొన్ని రోజుల్లో ఆర్థికమాంద్యం!

2025 ద్వితీయార్థంలో ఆర్థికమాంద్యం వస్తుందని USలో మెజారిటీ కార్పొరేట్ ఫైనాన్స్ చీఫ్స్ అంచనా వేస్తున్నారు. ట్రంప్ టారిఫ్స్, రాజకీయ, ఆర్థిక అనిశ్చితి, కన్జూమర్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడమే ఇందుకు కారణమని CNBC CFO కౌన్సిల్ సర్వేలో అభిప్రాయపడ్డారు. మాంద్యం వస్తుందని 3 నెలల క్రితం 7% మంది అంచనా వేయగా ఇప్పుడీ సంఖ్య 60%కి చేరుకుంది. 2026లో ఆర్థిక వ్యవస్థ సంకోచం మొదలవుతుందని మరో 15% అంచనా వేశారు.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్‌తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


