News March 25, 2024
ఎయిర్‌టెల్, జియో యూజర్లకు షాక్?

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎయిర్‌టెల్, జియో తమ ఆదాయం పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నాయి. ధరలు పెంచి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. ప్యాకేజీ ధరలు పెంచకుండా డేటా వినియోగం మరింత పెంచి తద్వారా అధిక ధరలు గల ప్యాకేజీల వైపు కస్టమర్లను మళ్లించేలా జియో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌టెల్ 15శాతం వరకు టారిఫ్‌లను పెంచే ఛాన్సుంది.
Similar News
News March 28, 2026
తొక్కిసలాట మృతులకు నివాళి.. మెమోరియల్ ఏర్పాటు

IPL: RCB గెలుపు వేడుకల్లో జరిగిన తొక్కిసలాట మృతులకు నివాళులర్పిస్తూ చిన్నస్వామి స్టేడియం వద్ద KSCA మెమోరియల్ ఏర్పాటు చేసింది. గత జూన్ 4న జరిగిన ఘటనలో 11 మంది చనిపోగా వారిని గుర్తు చేసుకుంటూ ప్రాక్టీస్‌లో ప్లేయర్లు సైతం 11 నంబర్ జెర్సీలు ధరించారు. ఇక RCB ప్లేయర్లు ఇవాళ చేతికి నల్ల బ్యాండ్లు ధరించి ఆడనున్నారు. అలాగే చిన్నస్వామి స్టేడియంలో ఇకపై 11 సీట్లను ఖాళీగా ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
News March 28, 2026
ఎయిర్‌పోర్టు వల్ల ₹15Cr పరిహారం.. హెలికాప్టర్ కొన్న రైతు!

నోయిడాలో <<19499063>>విమానాశ్రయ<<>> నిర్మాణంతో కొందరు రైతుల జీవితాలు మారిపోయాయి. భూ సేకరణలో భాగంగా ₹15Cr పరిహారం పొందిన ఓ రైతు ఓ హెలికాఫ్టర్‌ను కొని థాయిలాండ్‌కు ట్రిప్ ప్లాన్ చేశాడు. మరో వ్యక్తి అక్కడి ప్రాజెక్టులకు లేబర్‌ను సప్లయ్ చేసే కాంట్రాక్టర్‌గా మారాడు. అజయ్ అనే వ్యక్తి హెల్మెట్లు, తాళాలు భద్రపరిచే సెంటర్‌తో నెలకు ₹60,000 సంపాదిస్తున్నాడు. కొందరు గదులు నిర్మించి వలస కార్మికులకు అద్దెకిస్తున్నారు.
News March 28, 2026
DMK ఫస్ట్ లిస్ట్.. OPSకు సీటు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో CM స్టాలిన్ DMK తొలి జాబితాను విడుదల చేసిన <<19500787>>విషయం<<>> తెలిసిందే. మాజీ CM, AIADMK నుంచి ఇటీవల ఆ పార్టీలో చేరిన O పన్నీర్ సెల్వమ్‌కు బోడినాయక్కనూర్ సీటు కేటాయించారు. ఆయన అనుచరులు స్టాలిన్-కొలతూర్, ఉదయనిధి-చెపాక్ నుంచి బరిలోకి దిగనున్నారు. స్టాలిన్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని ఇటీవల OPS వ్యాఖ్యానించారు. <<-se>>#ELECTIONS2026<<>>


