News December 20, 2024

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు షాక్

image

Prime యూజర్లకు Amazon షాక్ ఇచ్చింది. జనవరి 2025 నుంచి కొత్త నిబంధనను తీసుకొస్తోంది. వచ్చే నెల నుంచి ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లు ఒక్కో ఖాతా 5 డివైజుల్లో మాత్రమే వినియోగించవచ్చు. అందులో రెండు టీవీల్లో మాత్రమే ఉపయోగించవచ్చు. ఒకవేళ మూడో టీవీలో లాగిన్ అయితే మూడు నిమిషాల్లో లాగౌట్ అవుతుంది. ప్రస్తుతం యూజర్లు 10 డివైజుల్లో(5 టీవీలు) ఒకేసారి లాగిన్ అవ్వొచ్చు. మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌ల్లో లాగిన్ చేయొచ్చు.

Similar News

News December 4, 2025

పంట వ్యర్థాలను కలియదున్నితే కలదు లాభం

image

పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బనశాతం పెరుగుతుంది. తర్వాతి పంట దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశముంది. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో నిపుణుల సూచనతో భూమిలో సూపర్‌ ఫాస్పెట్‌ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు అది ఎరువుగా మారి మంచి దిగుబడులు వస్తాయి.

News December 4, 2025

హనీమూన్ వెకేషన్‌లో సమంత-రాజ్!

image

ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత-రాజ్ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట మరుసటి రోజే హనీమూన్‌కు గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ కపుల్ వెళ్తున్న వీడియోలు వైరలయ్యాయి. కాగా 2 ఏళ్లకు పైగా రిలేషన్‌లో ఉన్న ఈ జోడీ కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో ‘భూత శుద్ధి వివాహం’ పద్దతిలో ఒక్కటైన సంగతి తెలిసిందే.

News December 4, 2025

OTTలోకి మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్

image

‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. టామ్ క్రూజ్, హేలే అట్వెల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఆగస్టులో రెంటల్ పద్ధతిలో విడుదల చేయగా తాజాగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే చూడొచ్చు. ఈ చిత్రం ఈ ఏడాది మేలో విడుదలైంది.