News October 29, 2024
అమెరికాకు షాక్: GEకి పెనాల్టీ వేసిన మోదీ సర్కార్!

అమెరికా/GEకి కేంద్రం షాక్ ఇచ్చినట్టు సమాచారం. తేజస్ ఫైటర్ జెట్లకు ఇంజిన్ల సరఫరా ఆలస్యం చేయడంతో భారీ స్థాయిలో జరిమానా విధించినట్టు తెలుస్తోంది. నిజానికి 2023 మార్చి నాటికే డెలివరీ ఆరంభించాల్సింది. మోదీ, రాజ్‌నాథ్ చాలాసార్లు దీనిపై చర్చించినా US ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసినట్టు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టులోని పెనాల్టీ క్లాజ్‌ను ఉపయోగించి ఒకటి కన్నా ఎక్కువ సార్లే ఫైన్ వేశారని వార్తలొస్తున్నాయి.
Similar News
News October 31, 2025
ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: కవిత

TG: తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో జనంబాట యాత్రలో భాగంగా మక్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సర్కార్ ప్రకటించిన ఎకరాకు రూ.10వేల పరిహారం ఏ మూలకూ సరిపోదని వ్యాఖ్యానించారు. మొలకెత్తినా, బూజు పట్టినా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా ధాన్యం కొనాలన్నారు.
News October 31, 2025
కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు (1/2)

ఆంధ్రప్రదేశ్‌లో బొండానికి, టెంకాయకు మేలైన కొబ్బరి రకాలు.
☛ ఈస్ట్‌కోస్ట్ టాల్: ఇది దేశవాళి పొడవు రకం. నాటిన 6 ఏళ్లలో కాపునకు వస్తుంది.  చెట్టుకు ఏడాదికి 80-100 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గౌతమి గంగ: ఇది పొట్టి రకం. నీటి బొండాలకు బాగా ఉపయోగపడుతుంది. నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. చెట్టుకు ఏడాదికి 85-90 కాయల దిగుబడి వస్తుంది. కాయలో నూనె దిగుబడి 69 శాతం. 
News October 31, 2025
కొబ్బరి సాగు.. అధిక దిగుబడినిచ్చే మేలైన రకాలు (2/2)

☛ డబుల్ సెంచరీ: ఇది పొడుగు కొబ్బరి రకం. నాటిన ఆరేళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 130 కాయల దిగుబడి వస్తుంది. ఈ రకం కొబ్బరిలో నూనె దిగుబడి 64 శాతం.
☛ గోదావరి గంగ: ఇది హైబ్రిడ్ కొబ్బరి రకం. నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. ఏడాదికి చెట్టుకు 140-150 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 68 శాతం. ఇవి కొబ్బరి బొండానికి, టెంకాయకు మేలైన రకాలు.  


