News October 23, 2024
కొనుగోలుదారులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం కొనుగోలుదారులకు షాక్. 10గ్రా. గోల్డ్ రేట్ రూ.80వేలు దాటింది. HYD బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రా. ధర రూ.430 పెరిగి రూ.80,070గా ఉంది. 22 క్యారెట్ల 10గ్రా. ధర రూ.400 పెరిగి రూ.73,400గా నమోదైంది. అంటు వెండి రేటు కూడా తగ్గేదేలే అంటోంది. కేజీ సిల్వర్ రేట్ రూ.2000 పెరిగి రూ.1,12,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.
Similar News
News January 9, 2026
ట్రంప్ మాస్టర్ ప్లాన్.. గ్రీన్‌లాండ్ ప్రజలకు డాలర్ల వల?

గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకునేందుకు ట్రంప్ టీమ్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. అక్కడి ప్రజలను ప్రలోభపెట్టేందుకు ఒక్కొక్కరికి లక్ష డాలర్ల వరకు ఆఫర్ చేయాలని వైట్‌హౌస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కుదరకపోతే COFA ఒప్పందం ఆప్షన్‌ను పరిశీలిస్తున్నారట. దీని ప్రకారం.. గ్రీన్‌లాండ్‌లో US ఆర్మీ కార్యకలాపాలు కొనసాగించుకుంటుంది. దీనికి ప్రతిఫలంగా USతో గ్రీన్‌లాండ్ డ్యూటీ ఫ్రీ ట్రేడ్ చేసుకోవచ్చు.
News January 9, 2026
కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

గువాహటిలోని <
News January 9, 2026
SBIలో 1,146 జాబ్స్.. ఒక్కరోజే ఛాన్స్

SBIలో 1,146 ఉద్యోగాలకు(కాంట్రాక్ట్) దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో VP వెల్త్(SRM) 582, AVP వెల్త్(RM) 237, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 327 ఉన్నాయి. అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. పోస్టును బట్టి 20-42ఏళ్ల వయసు ఉండాలి. జీతం VP వెల్త్‌కి ₹44.70L, AVP వెల్త్‌కి ₹30.20L, CREకి ₹6.20L వార్షిక జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://sbi.bank.in/


