News September 23, 2025

రేట్లు తగ్గుతాయనుకున్న సామాన్యులకు షాక్!

image

GST శ్లాబుల్లో మార్పుతో నిన్నటి నుంచి వస్తువుల ధరలు తగ్గుతాయని ఆశించిన సామాన్యులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. సూపర్ మార్కెట్లు సహా దుకాణాల్లో పాత స్టాకును పాత ధరలకే విక్రయిస్తున్నారు. MRP మార్చి తగ్గిన ధరలతో కొత్త స్టిక్కర్లు వేసి అమ్మాలన్న కేంద్రం ఆదేశాలను ఎక్కడా పాటించడం లేదు. కొత్త స్టాక్ వచ్చాకే రేట్లు తగ్గొచ్చని నిర్వాహకులు చెబుతుండటంతో వినియోగదారులు నిరాశతో నిట్టూరుస్తున్నారు.

Similar News

News February 9, 2026

దేనికోసం బాయ్‌కాట్? పాక్‌పై గంగూలీ ఫైర్

image

T20 WCలో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే పాకిస్థాన్ నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎలాగూ శ్రీలంకలో ఆడుతున్నప్పుడు ఇబ్బందేంటని ప్రశ్నించారు. అసలు దేనికోసం ఈ నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. వరల్డ్ కప్‌లో ప్రతీ పాయింట్ ముఖ్యమేనని హితవు పలికారు. బంగ్లాకు మద్దతు పలుకుతూ Feb 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాక్ బహిష్కరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

News February 9, 2026

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 376 పాయింట్లు పెరిగి 83,957 వద్ద.. నిఫ్టీ 117 పాయింట్లు పుంజుకొని 25,811 దగ్గర ట్రేడవుతోంది. అమెరికాతో మధ్యంతర ట్రేడ్ డీల్ సూచీల్లో ఉత్సాహం నింపింది. సెన్సెక్స్-30 సూచీలో SBI, కోటక్‌బ్యాంక్, టైటాన్, ఎటర్నల్, BEL షేర్లు లాభాల్లో.. పవర్‌గ్రిడ్, HUL, బజాజ్‌ఫైనాన్స్, ఇన్ఫీ, ICICI బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News February 9, 2026

స్కాములతో రేవంత్ చరిత్రలో నిలిచిపోతారు: హరీశ్

image

TG: బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులో ఉందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను BRS MLA హరీశ్ రావు ఖండించారు. తమ పొత్తు ప్రజలతోనేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఏనాడూ బీజేపీతో కలవలేదన్నారు. సిద్దిపేటలో మాట్లాడుతూ ‘ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ సంక్షేమ పథకాలతో చరిత్రలో నిలిచిపోయారు. రేవంత్ రెడ్డి మాత్రం స్కాములతో చరిత్రలో నిలిపోతారు’ అని విమర్శించారు.