News January 8, 2025

కాంగ్రెస్‌కు షాక్: ఢిల్లీలో ఆప్‌కే INDIA మద్దతు

image

‘INDIA’లో కాంగ్రెస్‌పై అపనమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ AAPకే మద్దతు ఇస్తున్నాయి. SP, SS UBT, TMC, RJD అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ప్రచారం చేయనున్నాయి. హస్తం పార్టీనెవరూ పట్టించుకోవడం లేదు. నిజానికి అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలే లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్యారీ దీదీ స్కీమ్‌నూ DK శివకుమార్ ప్రకటించారు. INC ఎలాగూ గెలవదనే కూటమి AAP వైపు మళ్లినట్టుంది.

Similar News

News January 9, 2026

ఏలూరు: రూ.25 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం

image

ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు భారీగా చోరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్‌జిల్లాల్లో దొంగలించిన 50 ద్విచక్రవాహనాలను రికవరీ చేసినట్లు ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌ వెల్లడించారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందని తెలిపారు. వాహన భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తమ బైక్‌లకు తప్పనిసరిగా జీపీఎస్‌ ట్రాకర్లు, స్మార్ట్‌ లాక్‌లు అమర్చుకోవాలని ఎస్పీ సూచించారు.

News January 9, 2026

ఒక్కటవనున్న NCP? అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు..!

image

మహారాష్ట్ర Dy.CM అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు NCP వర్గాలు మళ్లీ కలవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. పవార్ ఫ్యామిలీలో ఉన్న గొడవలు ఇప్పుడు సర్దుకున్నాయని అన్నారు. పింప్రి చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల కోసం రెండు వర్గాలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. NCP ఫౌండర్ శరద్ పవార్‌తో గ్యాప్ తగ్గినట్లు అజిత్ మాటలను బట్టి అర్థమవుతోంది.

News January 9, 2026

భారత్‌కు వెనిజులా నుంచి క్రూడాయిల్?

image

రష్యా క్రూడాయిల్ కొనకుండా భారత్‌పై టారిఫ్స్‌తో అమెరికా ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ కంట్రోల్‌లోని వెనిజులా చమురును ఇండియాకు అమ్మాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘వెనిజులా ఆయిల్‌ను గ్లోబల్‌గా మార్కెట్ చేయాలని US యత్నిస్తోంది. ఇండియాకు అమ్మేందుకూ సిద్ధంగా ఉంది’ అని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. కాగా 50M బ్యారెళ్ల ఆయిల్‌ను వెనిజులా తమకు <<18798755>>అందజేస్తుందని<<>> ట్రంప్ ప్రకటించడం తెలిసిందే.