News March 24, 2025

ఢిల్లీకి షాక్.. 7కే 3 వికెట్లు

image

IPL: వైజాగ్ వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కష్టాల్లో పడింది. 1.4 ఓవర్లలో 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఫ్రేజర్ 1, పోరెల్ 0, రిజ్వీ 4 పరుగులకు ఔటయ్యారు. శార్దూల్ 2, సిద్ధార్థ్ ఒక వికెట్ తీశారు. క్రీజులో అక్షర్, డుప్లెసిస్ ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 209 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 28, 2025

ఖమ్మం: ఎన్నికల విధులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి

image

ఎన్నికల విధులను అధికారులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుధామ రావు అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌లతో కలిసి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, ఎంసీఎంసీ సెల్, మీడియా సెంటర్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

News November 28, 2025

‘థర్డ్ వరల్డ్’ దేశాల లిస్ట్‌లో భారత్‌ ఉందా?

image

థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను నిలిపివేస్తామని ట్రంప్<<18410545>> ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ‘థర్డ్ వరల్డ్’ పదం ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాపులర్ అయింది. అప్పట్లో అమెరికా-నాటో దేశాలు ఫస్ట్ వరల్డ్, సోవియట్ యూనియన్ అనుబంధ దేశాలు సెకండ్ వరల్డ్‌గా, ఏ పక్షానికీ చేరని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పేద దేశాలను ‘థర్డ్ వరల్డ్’ అని పిలిచేవారు. UN LDCs లిస్ట్ ప్రకారం ఇందులో 44 దేశాలు ఉన్నాయి. వీటిలో భారత్‌ లేదు.

News November 28, 2025

మేనరిక వివాహాలు చేసుకుంటున్నారా?

image

మేనరికపు వివాహాలు చేసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే వివాహం అయితే జెనెటిక్‌ కౌన్సెలింగ్‌కి వెళ్లాలి. జెనెటిక్, క్రోమోజోమ్స్‌ కారణాలతో గర్భస్రావం అవుతుంటే కార్యోటైప్‌ టెస్ట్‌, అబార్షన్‌ అయితే పిండానిదీ, తల్లిదండ్రులదీ జెనెటిక్‌ మేకప్‌ చేయించుకోవాలి. థైరాయిడ్, డయాబెటిస్, ఎనీమియా వంటివి కూడా ముందే చెక్ చేయించుకోవాలి.