News October 16, 2024

ఇంగ్లండ్‌కు షాక్.. సెమీస్ చేరిన విండీస్

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు విండీస్ షాకిచ్చింది. కీలక మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఛేదనలో విండీస్ 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. ఇంగ్లండ్ ఓటమితో దక్షిణాఫ్రికా కూడా చేరడం గమనార్హం.

Similar News

News November 22, 2025

6 నెలల్లో అమరావతి రైతుల సమస్య పరిష్కారం: కమిటీ

image

AP: అమరావతి రైతుల స‌మ‌స్య‌ల‌ను 6నెలల్లోగా ప‌రిష్క‌రిస్తామ‌ని త్రీమెన్ క‌మిటీ హామీ ఇచ్చింది. 98% ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, ఇంకా 700 ఎకరాలపై సమస్య ఉందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పరిశీలన తర్వాత జరీబు, మెట్టభూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. లంకభూములపై గ్రీన్ ట్రిబ్యునల్‌ తీర్పు FEBలో వచ్చే అవకాశముందన్నారు. 719 మందికి మాత్రమే ఇంకా ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి నారాయణ చెప్పారు.

News November 22, 2025

యాపిల్ ఎయిర్‌డ్రాప్ ఫీచర్ క్రాక్ చేసిన గూగుల్

image

ఐఫోన్లలో ఉండే క్విక్ షేర్ ఫీచర్ ఎయిర్‌డ్రాప్‌ను గూగుల్ క్రాక్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు డేటా, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని వెల్లడించింది. యాపిల్ సహకారం లేకుండానే దీనిని సాధించామని గూగుల్ ప్రతినిధి అలెక్స్ మొరికోనీ తెలిపారు. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అన్ని మోడల్స్‌లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీని వల్ల యూజర్ల సేఫ్టీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు.

News November 22, 2025

IIT హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులు

image

<>IIT <<>>హైదరాబాద్‌లో 2 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.35వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: iith.ac.in