News September 18, 2024
ఫ్యాన్స్‌కు షాక్: దేవర ‘ఆయుధపూజ’ వాయిదా

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు దేవర మూవీ టీమ్ షాక్ ఇచ్చింది. చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న ఆయుధ పూజ సాంగ్‌ను రేపు రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. దాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా తెలిపింది. ‘ఆయుధ పూజ అనేది సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఓ మ్యాడ్నెస్. రేపు రిలీజ్ చేయడం లేదు. కానీ మీరు ఎదురుచూస్తున్న ‘హై’ని కచ్చితంగా ఇస్తాం’ అని ట్వీట్ చేసింది. దీంతో తారక్ ఫ్యాన్స్ నుంచి నిరాశ వ్యక్తమవుతోంది.
Similar News
News September 13, 2025
ఆంధ్ర క్రికెట్ హెడ్ కోచ్‌గా గ్యారీ స్టీడ్

ఆంధ్ర మెన్స్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్‌ను ACA నియమించింది. ఈ నెల 20-25 తేదీల మధ్య ఆయన బాధ్యతలు చేపడతారని సమాచారం. కాగా గ్యారీ ఆధ్వర్యంలో కివీస్ 2019 WC ఫైనల్ చేరుకుంది. అలాగే 2021 WTC టైటిల్ సాధించింది. మరోవైపు ఆంధ్ర గత రంజీ సీజన్లో గ్రూప్-Bలో ఆరో స్థానంలో నిలిచింది. VHTలో గ్రూప్-Bలో నాలుగు, SMATలో ప్రీక్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లింది.
News September 13, 2025
బాగా నమిలి తినండి: వైద్యులు

ఆహారాన్ని గబగబా తినొద్దని, అలా చేస్తే సరిగ్గా జీర్ణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఎంత తక్కువ సమయంలో తినడం పూర్తి చేస్తే అంత ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. వేగంగా, నమలకుండా తింటే సరిపడనంత తిన్నామనే భావన కలగదని.. అరగంట పాటు నెమ్మదిగా, బాగా నమిలి తినాలని సూచిస్తున్నారు. దీనివల్ల అది పూర్తిగా జీర్ణమై పోషకాలన్నీ శరీరానికి అందుతాయని, అలాగే దవడలకూ మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.
News September 13, 2025
ఇండియా-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి: రాజా సింగ్

పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడొద్దని TG ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆసియా కప్‌లో రేపు జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. భారతీయులందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అటు ఈ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపకపోవడంతో టికెట్ సేల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.