News January 2, 2025
5వ టెస్టుకు ఆకాశ్‌దీప్ దూరం

బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఇప్పటికే 2-1తో వెనుకంజలో ఉన్న టీమ్ ఇండియాకు మరో షాక్ తగిలింది. పేసర్ ఆకాశ్‌దీప్ నడుము నొప్పి కారణంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే 5వ టెస్టుకు దూరం కానున్నట్లు కోచ్ గంభీర్ తెలిపారు. ఈ సిరీస్‌లో పొదుపుగా బౌలింగ్ చేస్తున్న ఆకాశ్ కీలకమైన సిడ్నీ టెస్టుకు దూరమవడం భారత్‌కు బ్యాడ్‌న్యూసే అని చెప్పొచ్చు. ఇక అతడి ప్లేస్‌లో హర్షిత్ రాణాను తీసుకునే ఛాన్స్ ఉంది.
Similar News
News November 28, 2025
డిసెంబర్ 1న గ్లాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవం

కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జిని డిసెంబర్ 1న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. రూ.7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. దీని పొడవు 55 మీటర్లు. ఒకే సమయంలో 100 మంది బరువును ఈ గ్లాస్ బ్రిడ్జి మోయగలదు. అయితే ముందు జాగ్రత్తగా 40 మంది చొప్పున బ్యాచ్‌లను అనుమతించనున్నారు. విశాఖకు పర్యాటకులు ఎక్కువమంది వచ్చే సీజన్ కావడంతో దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.
News November 28, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

పార్వతీపురం కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గురువారం తెలిపారు. పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు, పదవీ విరమణ పొందినవారు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చు అన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలని ఆదేశించారు.
News November 28, 2025
SU MBA, MCA పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరుగనున్న MBA, MCA విభాగంలో 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా DEC 5 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో DEC 9 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌లో చూడాలని లేదా ఆయా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.


