News August 18, 2025

జియో యూజర్లకు షాక్

image

రిలయన్స్ జియో రెండు బేసిక్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్‌లను రద్దు చేసింది. రూ.209(22 డేస్, డైలీ 1GB), రూ.249(28 డేస్, డైలీ 1GB) ప్లాన్‌లను తీసేసింది. దీంతో వినియోగదారులు రూ.299(1.5GB, 28D) ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. అటు ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా బేస్ ప్లాన్స్ కూడా రూ.299(డైలీ 1GB)గా ఉన్నాయి. మరోవైపు వచ్చే 6 నెలల్లో రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశం ఉందని టెలికం నిపుణులు చెబుతున్నారు.

Similar News

News August 19, 2025

TODAY HEADLINES

image

★ ప్రధాని మోదీతో శుభాంశు శుక్లా భేటీ
★ తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు
★ తప్పుడు ప్రచారాలతో వైసీపీ గందరగోళం సృష్టిస్తోంది: CM చంద్రబాబు
★ కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగాయి: CM రేవంత్
★ కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల ఫైర్
★ కోట శ్రీనివాస్ రావు భార్య కన్నుమూత
★ భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

News August 18, 2025

బందీల విడుదలకు అంగీకరించిన హమాస్!

image

ఇజ్రాయెల్‌తో 60 రోజుల సీజ్‌ఫైర్‌కు పాలస్తీనా టెర్రర్ గ్రూప్ హమాస్ అంగీకరించిందని Reuters తెలిపింది. ఈ మేరకు మిగిలిన బందీలను విడుదల చేయనుందని పేర్కొంది. అదే సమయంలో గాజా నుంచి ఇజ్రాయెల్ క్రమంగా తమ బలగాలను వెనక్కి తీసుకోనుందని చెప్పింది. అయితే బందీలందరినీ వదిలేసి ఆయుధాలను పక్కనపెడితేనే యుద్ధం ఆపుతామని గతంలో ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ సీజ్‌ఫైర్ ఎన్ని రోజులు అమల్లో ఉంటుందో చూడాలి.

News August 18, 2025

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వాయుగుండం కారణంగా రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఏపీలోని మన్యం, తెలంగాణలోని సిద్దిపేట జిల్లాల్లో మంగళవారం సెలవు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి(D) మద్నూర్, డోంగ్లి మండలాలకూ సెలవు ఇచ్చారు. కాగా వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఇరు రాష్ట్రాల CMలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.