News September 24, 2024

కర్ణాటక CM సిద్దరామయ్యకు షాక్

image

ముడా కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. దర్యాప్తు కోసం గవర్నర్ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూ కేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సిద్దరామయ్య కుట్ర చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై విచారణకు గవర్నర్ ఆదేశించారు.

Similar News

News December 24, 2025

ఒంటరిగా గెలవలేకే ఉద్ధవ్ సోదరులు కలిశారు: మహా CM

image

రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చలు జరుగుతున్న రేంజ్‌లో వారి కలయికను <<18657891>>ఉద్ధవ్ సోదరులు<<>> చూపుతున్నారని మహారాష్ట్ర CM ఫడణవీస్ ఎద్దేవా చేశారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిన శివ్ సేన (UBT), మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన (MNS) కలయిక వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదన్నారు. సిద్ధాంతాలు పక్కనపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే కలిశారని చెప్పారు. ఈ 2 పార్టీలు విడివిడిగా పోటీ చేసి గెలవలేవని తేలిపోయిందన్నారు.

News December 24, 2025

కుంభమేళా to ఇండిగో గందరగోళం: 2025లో కీలక ఘటనలు

image

ఈ ఏడాది మహా కుంభమేళాతో మొదలైంది. పహల్గామ్ దాడి, ఢిల్లీ ఎర్రకోట పేలుడు భయాందోళనలు రేపాయి. బదులుగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆర్థికంగా ట్రంప్ టారిఫ్స్ షాకిచ్చినా, మోదీ పర్యటన వల్ల చైనాతో సంబంధాలు మెరుగుపడ్డాయి. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా, జీఎస్టీ సంస్కరణలు, నక్సల్స్ ఏరివేత ప్రధాన వార్తలుగా నిలిచాయి. చివరగా ఇండిగో విమానాల రద్దు వేలమందిని ఇబ్బంది పెట్టింది.

News December 24, 2025

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA,M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తును careers@bobcaps.in ఈమెయిల్‌కు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in