News June 25, 2024

కేజ్రీవాల్‌కు షాక్

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై రికార్డులను పరిశీలించకుండా ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిందని వ్యాఖ్యానించింది. దీంతో లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం తిహార్ జైలులోనే ఉండనున్నారు.

Similar News

News January 13, 2026

సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>CSIR<<>>-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 5 హిందీ ఆఫీసర్, MTS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు ఫిబ్రవరి 16వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(హిందీ, ఇంగ్లిష్), టెన్త్/ITI, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. హిందీ ఆఫీసర్ పోస్టుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, MTS పోస్టులకు ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdri.res.in/

News January 13, 2026

తప్పుడు కథనాలు, మార్ఫింగ్ ఫొటోల కేసులపై SIT ఏర్పాటు

image

TG: సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి మార్ఫింగ్ ఫొటోలు, మహిళా ఐఏఎస్‌పై తప్పుడు కథనాల కేసులపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ రెండు కేసులను దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటు చేసింది. ఐపీఎస్‌లు శ్వేత, యోగేశ్ గౌతమ్ సహా మొత్తం 8 మంది పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.

News January 13, 2026

‘మీ సేవ’ ముసుగులో భూ రిజిస్ట్రేషన్ల నిధుల స్వాహా!

image

TG: భూ భారతిలో వెలుగు చూసిన రిజిస్ట్రేషన్ల నిధుల స్వాహాపై విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘మీసేవ’లో భూ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకున్నా కొందరు నిర్వాహకులు ప్రజలను మభ్యపెట్టి తతంగాన్ని నడిపించారు. భూ భారతి (గతంలో ధరణి) సైట్లో నేరుగా దరఖాస్తులు అప్లోడ్ చేసి అక్రమాలకు తెగబడ్డారు. ‘మీసేవ’ ప్రభుత్వానిదేనన్న ఉద్దేశంతో ప్రజలూ నమ్మారు. దీంతో నిర్వాహకులు సొమ్ము కాజేసినట్లు అనుమానిస్తున్నారు.